సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు వస్తున్నాయంటే, చిన్న హీరోలు తమ విడుదల తేదీలు ఆ దగ్గరలో లేకుండా చూసుకుంటారు. కానీ తమిళ కమెడియన్ ఆర్. జె. బాలాజీ మాత్రం అందుకు భిన్నంగా సాహసమే చేస్తున్నాడు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ ‘పేట్ట’ సినిమా చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. జనవరి 10వ తేదీని ఫిక్స్ చేయవచ్చనే టాక్ వినిపిస్తోంది.ఇక అజిత్ ‘విశ్వాసం’ సంక్రాంతి బరిలోకి దిగనుంది. జనవరి 15వ తేదీన రావొచ్చని అంటున్నారు. ఈ నేపథ్యంలో తమిళ కమెడియన్ ఆర్.జె. బాలాజీ తాను హీరోగా చేసిన ‘ఎల్కేజీ’ సినిమాను సంక్రాంతి బరిలోకి దింపుతున్నాడు. పొలిటికల్ సెటైర్ కంటెంట్ తో రూపొందిన ఈ సినిమా, స్టార్ హీరోల సినిమాలతో పోటీకి దిగుతుండటం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.