: ఆ తల్లీ కూతుళ్లు ఒకరికొకరు దూరమై 35 ఏళ్లు అవుతోంది. మంగళవారం ఇద్దరూ ఒక్కదగ్గరకు చేరారు. ఆ సమయంలో వారి ఆనందానికి అవధుల్లేవు. అన్ని సంత్సరాల తర్వాత ఈ ఇద్దరు ఒక దగ్గరకు చేరడం వెనక ఓ ఆసక్తికర కథనం ఉంది. వివరాల్లోకి వెళితే.. సోనియా తల్లిదండ్రులు బుద్ధిమాంధ్యులు. కొన్ని నెలల వయస్సు ఉన్నప్పుడే ఆమెను తమ తల్లిదండ్రుల దగ్గర వదిలి వెళ్లారు. వాళ్లు ఆ అమ్మాయిని ముంబై తీసుకెళ్లారు. సోనియాకు ఎనిమిదేళ్ల వయస్సు వచ్చే సరికి ఆ ఇద్దరు కూడా చనిపోయారు. ఆ తర్వాత ఆమె వాళ్ల మామయ్య దగ్గరకు చేరింది. వాళ్లు కూడా ఈ అమ్మాయి బాగోగులు సరిగ్గా చూడలేకపోయారు. అక్కడి నుంచి చెన్నైలోని బన్యన్ సంస్థ దగ్గరకు చేరింది. అక్కుడున్న వారి బాగోగులు చూసుకోవడం., వంటపనుల్లో సహకరించడం లాంటి పనులు చేస్తూ అక్కడే ఉండిపోయింది. అయితే గత మూడేళ్లుగా సోనియా తల్లిందండ్రులను వెతకడం మొదలు పెట్టారు బన్యన్ సంస్థ నిర్వాహకులు. అయితే ఎలాంటి ఫలితం లేకపోవడంతో స్వచ్ఛంద సంస్థ సభ్యులు డాక్డర్ శాంత, డాక్టర్ కేవీ కిశోర్ కూమార్ తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు.
ఇదిలా ఉంటే కొన్ని రోజుల క్రితం మంత్రాలయం వెళ్లిన డాక్టర్ శాంతను ఓ మహిళ విపరీతంగా ఆకర్షించింది. వెతకబోతున్న తీగ కాలికి తగలినట్టు.. ఆమె సోనియా తల్లిని పోలి ఉంది. సోనియా పోలికలు ఆమెలో స్పష్టంగా కనపడుతున్నాయి. దీంతో ఆమె దగ్గరకు వెళ్లి మాట్లాడటం మొదలు పెట్టిన శాంతకు.. సోనియా తల్లి అనే విషయం స్పష్టమైంది. ఇక మరో ఆలోచన లేకుండా ఇద్దరినీ కలిపారు శాంత. 35 ఏళ్ల తర్వాత తన తల్లిని కలుసుకోవడంతో ఉబ్బితబ్బిబయ్యింది. ఇక తన తల్లి బాధ్యత తనదేనని తెలిపింది సోనియా.