తమిళనాట రజనీ .. కమల్ తరువాత ఆ స్థాయి స్టార్ హీరోలుగా అజిత్ – విజయ్ కొనసాగుతున్నారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు ‘సర్కార్’ గా వచ్చిన విజయ్, బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. దాంతో అజిత్ కూడా ‘విశ్వాసం’తో సంక్రాంతికి సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు. గతంలో శివ – అజిత్ కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. నాల్గొవ సినిమాగా ‘విశ్వాసం’ రూపొందుతోంది.ఈ సినిమాలో అజిత్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడు. రీసెంట్ గా పూణెలో జరిగిన చివరి షెడ్యూల్ తో ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. నయనతార కథానాయికగా నటించిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా కూడా సంచలన విజయాన్ని నమోదు చేస్తుందేమో చూడాలి.