బాలకృష్ణ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కోరికని తీర్చినట్టు తెలిసింది. క్రిష్ దర్శకత్వంలో మహానటుడు ‘ఎన్టీఆర్’ బయోపిక్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే బాలయ్యని కలిసిన రకుల్.. ఎన్ టీఆర్ బయోపిక్ లో నటించాలని ఉందనే కోరికని బయటపెట్టింది. ఏ చిన్ని పాత్రైనా చేసేందుకు రెడీ అని తెలిపింది. ఇప్పుడు రకుల్ కోరికని బాలయ్య తీర్చినట్టు చెబుతున్నారు.

ఎన్ టీఆర్ బయోపిక్ కోసం రకుల్ తీసుకొన్నారంట. ఐతే, ఇందులో రకుల్ ఓ ఐటమ్ సాంగ్ లో మెరవనున్నట్టు చెబుతున్నారు. ఎన్టీఆర్‌ సినిమాల్లోని చాలా ఐటెమ్‌ సాంగ్స్ సూపర్‌ హిట్‌గా నిలిచాయి. వీటిలో ఓ సాంగ్ లో రకుల్‌ చిందేయనుంది. ఐతే, ఆమె పాత్రని సినిమా రిలీజ్ వరకు సస్పెన్స్ గా ఉంచాలని చిత్రబృందం నిర్ణయించినట్టు చెబుతున్నారు. ఎన్ టీఆర్ బయోపిక్ లో విద్యాబాలన్, మోహన్‌ బాబు, రానా, కీర్తి సురేష్ తదితరులు కీలక పాత్రలో నటించనున్నారు.