స్మార్ట్‌ఫోన్ వాడే ప్రతీ ఒక్కరికీ ఎదురయ్యే సమస్య బ్యాటరీ లైఫ్. స్మార్ట్‌ఫోన్లలో చాలావరకూ కొన్న కొత్తలో బాగానే ఛార్జింగ్ ఉంటుంది. కానీ రోజులు గడిచే కొద్దీ బ్యాటరీ లైఫ్ క్రమేపి తగ్గిపోతుంటుంది. అయితే ఈ ఛార్జింగ్ కష్టాలను తీరాలంటే మా కంపెనీ నుంచి కొత్తగా విడుదలైన ఫోన్ కొనుక్కోమంటోంది జియోని కంపెనీ. ఈ కంపెనీ విడుదల చేసిన కొత్త స్మార్ట్‌ఫోన్‌లో ఏకధాటిగా 25గంటల పాటు వీడియోలు వీక్షించవచ్చట. 7000 mAh సామర్థ్యం కలిగిన బ్యాటరీతో ఈ స్మార్ట్‌ఫోన్ రూపొందించారు. కొత్త సంవత్సరం కానుకగా ఎమ్2017 పేరుతో జియోని ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించనుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ పెడితే 915 గంటల పాటు ఫోన్లు మాట్లాడుకోవచ్చని ఈ కంపెనీ చెబుతోంది. ఫోన్‌కు ఛార్జింగ్ కూడా త్వరగా ఫుల్ అవుతుందట. కొన్ని ప్రత్యేక ఫీచర్లతో రానున్న ఈ ఫోన్ ధర 68,240రూపాయలుగా కంపెనీ నిర్ణయించింది. జియోని ఎమ్2017 ఫీచర్లు ఇవే…