ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు… జరుగుతున్న ఆట పోటీల్లో ఏదేశం విజయం సాధిస్తుందనేది ముందుగా తెలుసుకునుందకు కొందరు అక్టోపస్ లేదా తాబేళ్లు వంటి మూగజీవులను ఉపయోగిస్తారు. అవి వేటిని టచ్ చేస్తే అవి గెలుస్తాయని నమ్మకం. ఇందులో భాగంగానే ఫుట్‌బాల్‌ ప్రపంచ కప్‌లో జపాన్‌ ఆడిన మూడు మ్యాచ్‌ల ఫలితాల గురించి ముందుగానే కరెక్ట్‌గా జోస్యం చెప్పింది ఆక్టోపస్. నిజం చెప్పడే దాని చావుకు కారణమైంది.

రాబియో అనే ఆక్టోపస్‌ను కిమియో ఆబె అనే వ్యక్తి సముద్రం నుంచి తీసుకొచ్చాడు. ఆ తర్వాత దాని జ్యోతిష్యం మొదలైంది. పూర్తిగా నీళ్లు నింపిన బక్కెట్లపై ఒక్కో ఫలితం రాసి వాటి మధ్యలో ఈ ఆక్టోపస్‌ను వదిలేవారు. అదిదేనిని ఎంచుకుంటే అదే ఫలితం వచ్చింది. అయితే ఇప్పుడు కిమియో దానిని చంపేసి షాపులో అమ్మకానికి పెట్టేశాడు.
గ్రూప్‌ దశలో కొలంబియాతో జపాన్‌తో గెలుస్తుందని, సెనెగల్‌తో ‘డ్రా’ చేసుకొని… పోలాండ్‌ చేతిలో ఓడుతుందని ఈ ఆక్టోపస్‌ చెప్పిన జోస్యం నిజమైంది. ప్రిక్వార్టర్స్‌లో బెల్జియం చేతిలో జపాన్ ఓడిపోయింది. జోస్యం కరెక్ట్‌గా చెప్పడంతో రాబియోకు వస్తున్న పేరు ప్రఖ్యాతులకంటే దానిని చంపి అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయని… అందుకే దాన్ని చంపక తప్పలేదని కిమియో అంటున్నాడు.