తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ, బోజ్‌పురి భాషల్లో నటించి టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది నటి రంభ. ఇండస్ట్రీలో అగ్రహీరోలందరి సరసన నటించిన ఈ స్టార్ హీరోయిన్ సిల్వర్ స్క్రీన్‌కు దూరమై దశాబ్దానికిపైనే అవుతుంది. వైవాహిక జీవితంతో బిజీ అయి ప్రస్తుతం విదేశాల్లో సెటిల్ అయింది. ఇక రంభ ఆ మధ్య ఓ టీవీ రియాలిటీ షోకు జడ్జిగా కూడా వ్యవహరించింది. ప్ర‌స్తుతం సినిమాల‌లో ట్రై చేస్తుంద‌ని స‌మాచారం. అయితే ఈ అమ్మ‌డు రీసెంట్‌గా యూఎస్‌లో ఉన్న స‌ల్మాన్‌ని క‌లిసింది. స‌ల్మాన్ ప్ర‌స్తుతం దబాంగ్ టూర్‌లో భాగంగా యూఎస్‌లో ఉన్నారు. ఈ విష‌యం తెలుసుకున్న రంభ ఫ్యామిలీతో క‌లిసివ‌చ్చి స‌ల్మాన్‌తో పాటు మిగ‌తా చిత్ర యూనిట్‌తో క‌లిసి ఫోటోలు దిగింది.

 

రంభ 1997లో స‌ల్మాన్ స‌ర‌స‌న జుడ్వా అనే చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించింది . ఈ సినిమా భారీ విజ‌యం సాధించింది. ఇక సల్మాన్‌ని క‌లిసిన రంభ పాత జ్ఞాప‌కాల‌ని నెమ‌ర‌వేసుకుంది. ఆ త‌ర్వాత నటులు కత్రినా కైఫ్‌, సోనాక్షి సిన్హా, ప్రభుదేవా, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ తదితరులతో కలిసి ఫొటోలు దిగారు. వీటిని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఈ ఫోటోల‌లో రంభ కూతురిని చూసిన నెటిజ‌న్స్ అచ్చం ఆమెలానే ఉంద‌ని అంటున్నారు.