ప్రపంచంలోనే అతిపొడవైన గోళ్లు కలిగిన శ్రీధర్ చిల్లాల్ ఎట్టకేలకు తన గోళ్లను కట్ చేయించుకునేందుకు రాజీ పడ్డారు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ చిల్లాల్ 1952 నుంచి తన ఎడమచేతి వేళ్ల గోళ్లను పెంచుతూ వచ్చారు. దీంతో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అయితే ఇప్పడు 82 ఏళ్ల వయసులో ఎట్టకేలకు తన గోళ్లకు కత్తిరించుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇతని గోళ్ల మొత్తం పొడవు 909.6 సెంటీమీటర్లు. అలాగే అతని ఒక్కగోరు పొడవు 197.8 సెంటీమీటర్లు. 2016లో చిల్లాల్.. ఒక్కచేతివేళ్లకు అత్యంత పొడవైన గోళ్లు కలిగిన వ్యక్తిగా గిన్నీస్‌బుక్‌లో స్థానం సంపాదించారు. మహారాష్ట్రలోని పూణెకు చెందిన చిల్లాల్ మొదట తన గోళ్లను కత్తిరించి, మ్యూజియంలో పెట్టేందుకు నిరాకరించారు. అయితే ఎట్టకేలకు అందుకు అంగీకరించారు.