అఖిల్ లవ్ స్టోరీకి మాస్ మసాలా యాడ్ చేస్తున్నాడు వెంకీ అట్లూరి. బ్లాక్ బస్టర్ జర్నీ చెయ్యాలనుకుంటోన్న అక్కినేని కుర్రాడిని, పాత ట్రాక్‌లోకి తీసుకెళ్తూ కమర్షియల్ హీరోగా మార్చేస్తున్నాడు ఈ దర్శకుడు.
అఖిల్ పవర్ ఫుల్ హిట్ కోసం చాలా కష్టపడుతున్నాడు. బ్యాక్ గ్రౌండ్‌కు తగ్గ హిట్ కొట్టి, స్టార్ లీగ్‌లో అడుగుపెట్టాలని మొదటి సినిమా నుంచే ప్రయత్నిస్తున్నాడు. అయితే మొదట మాస్ స్టోరీస్ వైపు వెళ్ళిన అఖిల్, తర్వాత తన బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్లుగా ప్రేమకథలకు షిఫ్ట్ అయ్యాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘హలో’ అంటూ పలకరించి ఆకట్టుకున్న ‘సిసింద్రీ’ ఇప్పుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ‘తొలిప్రేమ’తో వరుణ్ తేజ్‌కు రొమాంటిక్ హిట్ ఇచ్చిన ఈ దర్శకుడు, ఇప్పుడు అఖిల్‌తోనూ ప్రేమ కథనే తీస్తున్నాడు. అయితే ఈ లవ్ స్టోరీలో మాస్‌తో గోల చేయించేలా ఓ ఐటెం సాంగ్‌ని ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు.