తాజాగా ‘పరుచూరి పాఠాలు’ కార్యక్రమంలో ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాను గురించి పరుచూరి గోపాలకృష్ణ ప్రస్తావించారు. “ఈ సినిమా మొదలైన 18 నిమిషాల వరకూ యాక్షన్ సీన్స్ తో త్రివిక్రమ్ విందుభోజనం పెట్టేశాడు. మొదటి 18 నిమిషాల్లోనే ఆ రేంజ్ లో చూపించడంతో, ఓపెనింగ్ లోనే క్లైమాక్స్ చూసిన ఫీలింగ్ వచ్చింది. మొండి కత్తితో హీరో చాలామందిని చంపేశాక, “మీ తాత ఇందుకోసం కత్తి పట్టాడు .. మీ నాయన ఇందుకోసం కత్తి పట్టాడు .. నువ్వు ఇందుకోసం కత్తి పడుతున్నావా?.. వదిలేయరా దాన్ని” అని హీరోతో నాయనమ్మ అంటుంది. ఆవిడను గౌరవించి హీరో కత్తిని వదిలేస్తాడు. దాంతో మాస్ ప్రేక్షకుల గుండె చల్లబడిపోయింది. ఆ తరువాత సినిమాలో లవ్ స్టోరి మొదలు కావడంతో, కొంతమంది ప్రేక్షకులకు మింగుడు పడక ‘ఇదేంట్రా హీరో సైలెంట్ అయిపోయాడు’ అనుకున్నారు. అలా కాకుండా లవ్ స్టోరీతో మొదలుపెట్టి కథను నెమ్మదిగా తీసుకెళ్లాల్సింది” అని చెప్పుకొచ్చారు.