ఒక మనసు సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన నిహారిక, ప్రస్తుతం ‘హ్యాపీ వెడ్డింగ్’ చేస్తోంది. గతంలో తనే నిర్మాతగా ‘ముద్దపప్పు ఆవకాయ్’ వెబ్ సిరీస్ చేసి, మంచి మార్కులు కొట్టేసింది. మళ్లీ ఇప్పుడు అదే విధంగా ‘నాన్న కూచి’ వెబ్ సిరీస్ చేస్తోంది. నాగబాబు .. నిహారిక ఈ వెబ్ సిరీస్ లో తండ్రీ కూతుళ్లుగా నటిస్తుండటం విశేషం. ఆనంద్ రాజ్ పాత్రలో నాగబాబు .. ఆయన కూతురు తార పాత్రలో నిహారిక కనిపించనున్నారు. ఈ వెబ్ సిరీస్ నుంచి నిన్న ఓ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకునేలా వుంది. తండ్రీ కూతుళ్ల అనుబంధానికి అద్దం పడుతూ ఈ వెబ్ సిరీస్ కొనసాగుతుందని తెలుస్తోంది. ఆ ఇద్దరి జీవితాల్లోని వేరే కోణాలతో కథ ఆసక్తికరమైన మలుపులు తిరుగుతుందనేది ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. మొత్తం మీద ఈ ట్రైలర్ ఆకట్టుకునేలా .. ఆసక్తిని రేకెత్తించేదిలా ఉందని చెప్పొచ్చు.