Select your Top Menu from wp menus
Breaking News

చిత్తూరు జిల్లా: కుప్పం నియోజకవర్గంలో నువ్వా నేనా అంటున్న వై‌ఎస్‌ఆర్‌సి‌పి, టి‌డి‌పి నాయకులు.

చిత్తూరు జిల్లా: కుప్పం నియోజకవర్గంలో నువ్వా నేనా అంటున్న వై‌ఎస్‌ఆర్‌సి‌పి, టి‌డి‌పి నాయకులు.

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో,ఆంధ్రప్రదేశ్ మాజీ‌ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గంలో టిడిపి, వైసిపిల మద్య మాటల యుద్దం కాస్త పాదయాత్రలకు చేరింది. సోమవారం పోటాపోటి పాదయాత్రలకు రామకుప్పం మండలాన్ని వేదికగా ఎంచుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో హంద్రీనీవా కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేయాలంటూ హంద్రినీవా కాలువ వెంబడి పాదయాత్రకు సమాయత్తం అవ్వగా అదే రీతిలో వైసిపి పార్టీ ఆధ్వర్యంలో కుప్పంలో 25 వేల ఇండ్లను చంద్రబాబు కోర్టుకు వెల్లి ఆపేశారంటూ నిరసనగా రామకుప్పం మండలం నుండి కుప్పంలోని వైయస్సార్ సర్కిల్ వద్ద వరకూ పాదయాత్రకు సమాయత్తం అయ్యారు. కుప్పం నియోజలవర్గంలోని రామకుప్పం మండలం వేదికగా ఇరు పార్టీలు పాదయాత్రకు శ్రీకారం చుట్టాయి.. అయితే పోలీసుల రంగప్రవేశం చేసి పాదయాత్రలకు అనుమతులు లేదని కరాకండిగా తేల్చి చెప్పారు. ఈరోజు ఉదయాన్నే టిడిపి, వైసిపి పార్టీ ముఖ్య నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పాదయాత్రలకు అనుమతించభోమని ఇప్పటికే పలమనేరు డియస్పీ ఆరీఫుల్లా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు.

A1TV తెలుగు న్యూస్- చిత్తూరు జిల్లా.
కుప్పం రిపోర్టర్: వి.హరినాథ్ – 9392919674.

Related posts