Select your Top Menu from wp menus
Breaking News

తూర్పుగోదావరి జిల్లా: సేనపల్లి సాయి ప్రియ కు ఒక లక్షా రెండు వేల మూడు వందల ఇరవై ఐదు రూపాయలు ఫిక్సిడ్ డిపాజిట్ చేసినటువంటి పత్రాన్ని అందజేసిన మాదిరెడ్డి దొరబాబు.

తూర్పుగోదావరి జిల్లా: సేనపల్లి సాయి ప్రియ కు ఒక లక్షా రెండు వేల మూడు వందల ఇరవై ఐదు రూపాయలు ఫిక్సిడ్ డిపాజిట్ చేసినటువంటి పత్రాన్ని అందజేసిన మాదిరెడ్డి దొరబాబు.

యు కొత్తపల్లి మండలం ఫోటో అండ్ వీడియో అసోసియేషన్, గౌరవ అధ్యక్షులు అయినటువంటి, మాదిరెడ్డి దొరబాబు చేతుల మీదగా, సేనపల్లి సాయి ప్రియ కు ఒక లక్షా రెండు వేల మూడు వందల ఇరవై ఐదు రూపాయలు ఫిక్సిడ్ డిపాజిట్ చేసినటువంటి పత్రాన్ని అందజేయడం జరిగినది, సేనపల్లి లావరాజు ఫోటోగ్రాఫర్ అకాల మరణం చెందగా వారి భార్య కూడా చనిపోవడం జరిగినది, వీరికి ఒక పాప ఉన్నది పేరు సేనపల్లి సాయి ప్రియ, కు మానవతా దృక్పథంతో యు కొత్తపల్లి మండల అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి చిత్రాడ జగ్గారావు, సెక్రటరీ మొండి వెంకటరమణ, వీరు జిల్లాలో ఉన్నటువంటి మిగతా అసోసియేషన్ సభ్యులకు వీరి ఇరువురు గురించి వివరించగా ఆ పాపకు ఏదో ఒకటి చేస్తే బాగుంటుందని మన జిల్లాలో ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్లు సాయంతో 1,02325 సొమ్మును సేకరించడం జరిగింది, ఈ మొత్తం సొమ్మును సాయి ప్రియ పేరు మీదగా ఫిక్సిడిపాజిట్ చేసి సాయి ప్రియ నానమ్మ నాగ చక్రం కు అసోసియేషన్ తరపున అందజేయడం జరిగినది, అలాగే యు కొత్తపల్లి మండల అసోసియేషన్ సభ్యులకు PMKVY సర్టిఫికెట్లను, గౌరవ అధ్యక్షులు, మాదిరెడ్డి చేతుల మీదగా ఫోటో అండ్ వీడియో అసోసియేషణ సభ్యులకు అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టువంటి అధ్యక్షుడు చిత్రాడ జగ్గారావు, సెక్రటరీ మొండి వెంకటరమణ, వైస్ ప్రెసిడెంట్ బంగారు బాబు, జాయింట్ సెక్రెటరీ నాగేశ్వరరావు, కోశాధికారి చింతపల్లి సత్తిరెడ్డి, మాజీ అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి, అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొనడం జరిగింది.

A1TV తెలుగు న్యూస్
తూర్పుగోదావరి జిల్లా
పిఠాపురం రిపోర్టర్: బి. సురేష్ – 9392919471.

Related posts