Select your Top Menu from wp menus
Breaking News

తూర్పుగోదావరి జిల్లా: పిఠాపురం పట్టణంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయం లో మాజీ ఎమ్మెల్యే వర్మ పత్రికా సమావేశం

తూర్పుగోదావరి జిల్లా: పిఠాపురం పట్టణంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయం లో మాజీ ఎమ్మెల్యే వర్మ పత్రికా సమావేశం

పిఠాపురం పట్టణంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయం లో మాజీ ఎమ్మెల్యే వర్మ పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరద సహాయం అందించడంలో వైకాపా తీవ్రంగా విఫలమైందని, పునరావాస కేంద్రాల ఏర్పాటు ఎక్కడా జరగలేదని, గుప్పెడు భోజనం కూడా అందించలేదన్నారు. 15వ తేదీన ముంపు ప్రాంతాలను తాము సందర్శించి, భోజనం అందడం లేదని అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా, కొంతమందికి పంచుతున్నామని మాకు చూపించడం జరిగిందని, దీన్ని బట్టి చూస్తే గొల్లప్రోలు మున్సిపాలిటీలో భోజనం పేరు చెప్పి సుమారు రూ.10 లక్షలకు పైగా అవినీతి జరిగి ఉంటుందని, షాడో ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు మరియు కమిషనర్ కలిసి చేసిన స్కామ్ గా ఉందన్నారు. పిఠాపురంలో 24 వేల క్యూసెక్కుల నీరుని వదలడం వల్ల రైతులందరూ నష్టపోయారని, రైతులుకు నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు రెడ్డెం భాస్కర్ రావు, అల్లుమల్లు విజయ్ కుమార్, నల్లా శ్రీనివాస్, జనపరెడ్డి రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

A1TV తెలుగు న్యూస్
తూర్పుగోదావరి జిల్లా
పిఠాపురం రిపోర్టర్: బి. సురేష్ – 9392919471.

Related posts