Select your Top Menu from wp menus
Breaking News

పశ్చిమగోదావరి జిల్లా: రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆక్వా రంగానికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తున్నారు – రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సి ధర అప్పలరాజు.

పశ్చిమగోదావరి జిల్లా: రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆక్వా రంగానికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తున్నారు –  రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సి ధర అప్పలరాజు.

భారీ వర్షాలు,తమ్మిలేరు వరద కారణంగా దెందులూరు నియోజక వర్గం లో నష్టపోయిన ఆక్వా రైతులను కలిసి క్షేత్ర స్థాయి పరిశీలన కోసం మంత్రి అప్పలరాజు మరియు డెప్యూటీ సి ఎం మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని, దెందులూరు ఎం ఎల్ ఏ అబ్బయ్య చౌదరితో కలిసి కొల్లేరు ప్రాంతంలో శు క్రవారంపర్యటించారు. వారి తో పాటు విపత్తు నివారణ సంస్థ కమిషనర్ కన్నబాబు, జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకట రామి రెడ్డి మరియు ఆర్ డి ఓ పనబాక రచన కూడా పర్యటనలో పాల్గొనారు. ఎం ఎల్ ఏ అబ్బయ్య చౌదరి అక్కడ జరిగిన నష్టాన్ని మంత్రులకు వివరించారు. చేపల చెరువుల గట్లు తెగి పోయి వరద ప్రవాహం ఏ విధంగా ఆ ప్రాంతం మొత్తాన్ని కబళించేసిందో వివరించారు. స్థానిక రైతులు కూడా తమ నష్టాలను మంత్రులకు తెలియచేసారు. ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఈ వర్షాలు, వరదల సమస్య గురించి తెలియగానే వెంటనే, ముందు రైతుల నష్టానికి ఉపశమనం కలగ చేయాలని వెంటనే జిల్లా కలెక్టర్, మత్స్య శాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి, తక్షణమే మత్స్య శాఖ మంత్రి అప్పలరాజు ని ఇక్కడ పర్యటించి, పరిస్థితులను తెలుసుకోవాల్సిందిగా సూచించారని చెప్పారు. నష్టాలకి సంబంధించిన ప్రాథమిక నివేదిక సిద్ధం అవుతొందని, ఈ పర్యటన అనంతరం మరింత లోతుగా పరిశీలించి రైతులకు ఎలాంటి ఉపశమనం కలిగించాలో నిర్ణయిస్తామని అన్నారు.మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ భయోత్పాతం కల్పించిన వర్షాల అనంతరం, ఇక్కడ రైతుల నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. సుమారు 3000 ఎకరాల చెరువులు పూర్తిగా నష్టపోయినట్లు అధికారులు ఒక అంచనా ఇచ్చారని, అందులో దెందులూరు నియోజక వర్గానికి చెందింది సుమారు 2000 ఎకరాలు గా లెక్కించారని ఆయన తెలిపారు. వరదల వల్ల చెరువులో ఉండాల్సిన చేపలు రోడ్ల పైకి వచ్చేసాయని విని, ఎంత ఎక్కువగా నష్టం జరిగిందో ఊహిస్తున్నామని అన్నారు. లెక్కల నివేదికకు తమ ప్రత్యక్ష అనుభవం తో జోడించి రైతులకు తప్పక న్యాయం చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి తన విజ్ఞప్తి మన్నించి వెంటనే ఇద్దరు మంత్రులను ఇక్కడి నష్టం అంచనాల పరిశీలనకు పంపడం ఆయన నిబద్ధత తెలుపుతోంది అలాగే తక్షణమే ఆయన సహాయం కూడా అందిస్తారని ఆశిస్తున్నట్లు అబ్బయ్య చౌదరి చెప్పారు మాదేపల్లి, శ్రీపర్రు, జాలిపూడి గ్రామాల్లోనే సుమారు 1000 ఎకరాల చెరువులు పూర్తిగా ధ్వంసం అయ్యాయని ఆయన వారికి తెలిపారు. . వరదలు అని తెలిసినప్పటి నుండీ ఎం ఎల్ ఏ అబ్బయ్య చౌదరి చాలా తక్కువ వ్యవధిలోనే ఈ ప్రాంతాలన్నీ ఒక సారి పర్యటించి, వివరాలు సేకరించి, తానే మాకు దగ్గిర ఉండి జరిగిన నష్టాన్ని వివరిస్తున్న తీరు చాలా బావుందని, ఇంతటి వేగంతో పని చేసే నాయకుడు ఉంటే చాలు మీ కష్టాలన్నీ తీరిపోతాయని అబ్బయ్య చౌదరి ని కొనియాడారు మంత్రి అప్పలరాజు. అనంతరం స్థానిక నాయకులు కొల్లేరు లో ఎదుర్కుంటున్న సమస్యలని ప్రస్తావించగా, అవన్నీ తీరుస్తానని అప్పలరాజు హామీ ఇచ్చారు.

జిల్లా స్టాఫ్ రిపోర్టర్:ముద్రగడ భరత్- 9392919507.
A1TV తెలుగు న్యూస్

Related posts