Select your Top Menu from wp menus
Breaking News

విజయనగరం జిల్లా: గజపతినగరం లో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టిన కాంగ్రెస్ పార్టీ.

కేంద్రప్రభుత్వం ఆమోదించిన మూడు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులకు మద్దతుగా రెండు కోట్ల సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇంచార్జ్ బొడ్డు శ్రీ నివాసరావు మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ PCC అధ్యక్షులు సాకే.శైలజానాధ్ పిలుపు మేరకు అన్ని మండలాలలో భారీ ఎత్తున సంతకాల సేకరణ చెప్పటడం జరిగిందని, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మూడు రైతు వ్యతిరేక వ్యాసాయ బిల్లులు అత్యంత అప్రజాస్వామికంగా తీసుకువచ్చిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ బడుగు బలహీనవర్గాల రైతుల పక్షాన ఎప నిలబడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి ప్రెసిడెంట్ సరగడ రమేష్ కుమార్, డి సి సి జనరల్ సెక్రెటరీ డోల శ్రీనివాసరావు గజపతినగరం నియోజకవర్గం ఐదు మండలాలకు చెందిన మండల పార్టీ నాయకులు గాదాపు కూర్మినా నాయుడు, సామి రెడ్డి శివ, సన్యాసినాయుడు సుంకర అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

A1TV తెలుగు న్యూస్
విజయనగరం జిల్లా.
గజపతినగరం రిపోర్టర్: ఎస్.వెంకట్రావు – 9392919438.

Related posts