Select your Top Menu from wp menus
Breaking News

తూర్పుగోదావరి జిల్లా: పిఠాపురం మండలంలోని పలు గ్రామాలు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట పొలాలు నీట మునిగి 10 కోట్లు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ అధికారులు అంచనా.

తూర్పుగోదావరి జిల్లా: పిఠాపురం మండలంలోని పలు గ్రామాలు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు  పంట పొలాలు నీట మునిగి 10 కోట్లు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ అధికారులు  అంచనా.

పిఠాపురం మండలంలోని పలు గ్రామాలు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట పొలాలు నీట మునిగాయి రెండు వేల ఎకరాల్లో వరి పంట ముంపుకు గురయ్యాయి. 10 కోట్లు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ వరద నీటికి ఏలేరు దిగువ జాలలుతోడవడంతో పంట పొలాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి.ఆరుగాలం కష్టపడి న రైతుకి పంట చేతికి వచ్చే సమయానికి అకాల వర్షంతో నట్టేట ముంచింది. అనేక మంది కౌలు రైతులు రూ ఎకరాకు 30 వేలు చొప్పున పెట్టుబడి పెట్టి రైతుకు ఏలేరు వరద నీరు కన్నీటిని మిగిల్చింది. గ్రామాల్లోని అనేక రోడ్లు వరదనీటితో జలమయమై ఎక్కడికక్కడ గోతులు పడ్డాయి. ఆయా రోడ్డు గుండా ప్రయాణించే ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించ వలసి వస్తోంది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పంట నష్టపోయిన తమను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని కోరారు.

పిఠాపురం రిపోర్టర్: బి. సురేష్ – 9392919471.
A1TV తెలుగు న్యూస్

Related posts