Select your Top Menu from wp menus
Breaking News

తూర్పుగోదావరి జిల్లా: పల్లం గ్రామంలో ఐడి పోలీసులు లపై మద్యం మాఫియా దాడి.

తూర్పుగోదావరి జిల్లా: పల్లం గ్రామంలో ఐడి పోలీసులు లపై మద్యం మాఫియా దాడి.

తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం పల్లం గ్రామంలో పోలీసులపై మద్యం మాఫియా గ్యాంగ్ దాడి చేశారు. ఐ.డి పోలీసులకు శుక్రవారం తెల్లవారు జామున నీళ్ళరేవు వంతెన సమీపంలో యానాం మద్యాన్ని దిగుమతి చేస్తారన్న సమాచారం రావడంతో ఐడి పోలీసులు పహారా నిర్వహించారు. అక్రమ మద్యం దిగుమతి చేస్తున్న సమయంలో ఐడీ పోలీసులు మద్యం మాఫియా గ్యాంగ్ ను ఎదుర్కోవడంతో తెగబలిసిన మద్యం మాఫియా గ్యాంగ్ వారిపై తిరగబడ్డారు. అంతేకాకుండా తిరిగి సరుకును నది పాయ నుండి పడవలో మద్యాన్ని మళ్లించారు. ఈ కేసును పోలీసులు చాలెంజ్ గా తీసుకొని మద్యం అక్రమ వ్యాపారానికి చెక్ పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సంఘటన స్థలానికి ముమ్మిడివరం సి.ఐ జానకీరామ్, కాట్రేనికోన, ముమ్మిడివరం, ఐ.పోలవరం ఎస్సైలు జబీర్, నాగార్జున, రాము తో పాటు పోలీస్ సిబ్బంది చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

A1TV తెలుగు న్యూస్
తూర్పుగోదావరి జిల్లా
ముమ్మిడివరం రిపోర్టర్: సునిల్ శాస్త్రి – 9392919477.

Related posts