Select your Top Menu from wp menus
Breaking News

విజయనగరం జిల్లా: పేద ఇంటికి పెద్ద కష్టం – పోలీసుల ఔదార్యం.

విజయనగరం జిల్లా: పేద ఇంటికి పెద్ద కష్టం – పోలీసుల ఔదార్యం.

విజయనగరం జిల్లా, సాలూరు నియోజకవర్గం, మండల కేంద్రం మెంటాడ లో సొంత తోటలో జీవనం సాగిస్తున్న ఓ పేదింటి కి ఎంత కష్టం వచ్చింది. ఒకే ఇంటికి సంబంధించిన కారంగి పైడియ్య షుగర్, కిడ్నీ, ఆయన చెల్లెలు కారoగి అంకాలు కొన్నేళ్లుగా బోన్ క్యాన్సర్ తో బాధపడుతుంది ఇంట్లో ఉన్న డబ్బులతో పాటు కొంతమంది దాతలు చేసిన సహాయం తో ఇంతవరకు వైద్య సేవలు పొందారు. అంకాల కు ఫోన్ క్యాన్సర్ రావడం తో ఎడమ చేయి ఆపరేషన్ చేసి తొలగించారు. దాతల కోసం ఎదురు చూస్తున్న సమయంలో జిల్లా ఎస్పీ బి రాజకుమారి ఆదేశాల మేరకు, కొంతమంది మెంటాడ మీడియా మిత్రులు గజపతినగరం సి ఐ రమేష్ ఆండ్ర ఎస్ ఐ షేక్ శంకర్ శుక్రవారం పలువురు గ్రామ పెద్దల సమక్షంలో పదివేల రూపాయలు నగదు, నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భముగా సిఐ రమేష్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న పేద కుటుంబాలను, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని గుర్తించి పోలీసులు నిరంతరం సహాయ సహకారాలు అందిస్తుంది. ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఇదే సందర్భంగా మెంటాడ యువత సిఐ రమేష్ సమక్షంలో బాధితులకు రెండు వేల రూపాయలు నగదును అందజేశారు. డొంక రామ్మోహన్రావు బాధితులకు తన వంతుగా ఆయుర్వేదిక్ మందులను అందజేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పాండ్రంగి సన్యాసిరావు, గ్రామ పెద్దలు, గ్రామ యువకులు పాల్గొన్నారు.

A1TV తెలుగు న్యూస్
విజయనగరం జిల్లా.
గజపతినగరం రిపోర్టర్: ఎస్.వెంకట్రావు – 9392919438.

Related posts