Select your Top Menu from wp menus
Breaking News

పశ్చిమగోదావరి జిల్లా: మండల తసీల్ధార్ కార్యాలయం ఎదుట రెవిన్యూ ఉద్యోగుల సంఘం ధర్నా.

పశ్చిమగోదావరి జిల్లా: మండల తసీల్ధార్ కార్యాలయం ఎదుట రెవిన్యూ ఉద్యోగుల సంఘం ధర్నా.

పెదవేగి మండలం, పెదవేగి గ్రామం నందు మండల తసీల్ధార్ కార్యాలయం ఎదుట రెవిన్యూ ఉద్యోగుల సంఘం ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వి ఆర్ వో లు వి. శ్రీనివాస్, అద్దేపల్లి శివ, భీమడోలు ఆనంద రావు తదితరులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వి ఆర్ ఓ లు ఎంతో కాలంగా రెవిన్యూ వ్యవస్థలో పని చేస్తూ ఉండగా, సచివాలయం వ్యవస్థ వచ్చిన తర్వాత వి ఆర్ వో లకు సరైన గుర్తింపు లభించటం లేదని వాపోయారు. మరియు రెవిన్యూ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే విషయంలో ప్రభుత్వం వారు సంద్ధిగ్ధం లో ఉన్నందున వారి యొక్క జీతాలు ఇదివరకటి లాగే ఎమ్ ఆర్ వో గారి ఆధ్వర్యంలోనే ఇవ్వాలని ముఖ్య డిమాండ్ గా పేర్కొన్నారు. వీటితో పాటు వి ఆర్ వో లు ఎంతో కాలంగా పనిచేస్తున్నా కూడా వారికి పదోన్నతులు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారని, అదేవిధంగా ఫీల్డ్ లో విధులు నిర్వర్తించే రెవిన్యూ ఉద్యోగులకు బయోమెట్రిక్ విధానం ఇబ్బందిగా మారిందని ఈ విధానాన్ని రద్దు చేయవలందిగా కోరుతూ, రెవిన్యూ ఉద్యోగుల సంఘం తరపున ఆర్ ఐ మాణిక్యాల రావు గారికి మెమోరాండం అంద చేయడం జరిగింది.

A1TV తెలుగు న్యూస్
పశ్చిమగోదావరి జిల్లా
దెందులూరు రిపోర్టర్: బాలాజి – 9392919507

Related posts