Select your Top Menu from wp menus
Breaking News

శ్రీకాకుళం జిల్లా: అత్యంత అరుదైన గౌరీ బెత్తు జాతి సర్పం ప్రత్యక్షం.. !

శ్రీకాకుళం జిల్లా: అత్యంత అరుదైన గౌరీ బెత్తు జాతి సర్పం ప్రత్యక్షం.. !

నల్లని శరీరంపై మేలిమి పసుపు రంగు చారలతో మిలమిల మెరుస్తూ, సాక్షాత్తు గౌరీదేవి భువికి దిగివచ్చినట్టుగా అరుదైన ఆ ‘గౌరిబెత్తు ‘ జాతిపాము అర్ధరాత్రి గారమండలం బూరవెల్లి గ్రామంలో ప్రత్యక్షమై హలచల్ చేయటంతో గ్రామస్తులు హడలిపోయారు. అలికిడికి ఆ పాము బెదిరిపోయి సమీపంలోని వెదురు బుట్టలోకి దూరి చుట్టుకొని పడుకొంది. భూషణం అనే యువకుడు సాహసించి ఆ బుట్టమూత మూసేసాడు. అనంతరం గ్రీన్ మెర్సీ స్నేక్ రెస్క్యూ టీంకి సమాచారం అందించారు. స్నేక్ రెస్క్యూ టీం హుటాహుటిన ఆ గ్రామానికి చేరుకొంది. గ్రీన్ మెర్సీ సి. ఈ. ఓ., రమణ మూర్తి నేర్పుగా ఆ పాముని పట్టి, బంధించడంతో గ్రామస్తులు ఊపిరి తీసుకున్నారు. ఈ పాము బ్యాండెడ్ క్రైట్ జాతికి చెందిన అత్యంత విషపూరిత సర్పమైనా, చాలా అరుదుగా కనిపిస్తుందని, కనిపిస్తుందని, సాధారణంగా కరవదని రెస్క్యూఏ టీంకి నేతృత్వం వహించిన రమణ మూర్తి తెలిపారు.రాత్రులందు మాత్రమే సంచరించే ఈ జాతి పాములు ఉనికి ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో కనిపిస్తుందని రమణ మూర్తి తెలిపారు.

A1TV తెలుగు న్యూస్
శ్రీకాకుళం జిల్లా
శ్రీకాకుళం రిపోర్టర్: ఎం.కళ్యాణ చక్రవర్తి – 9392919427.

Related posts