Select your Top Menu from wp menus
Breaking News

తూర్పుగోదావరి జిల్లా: ముమ్మిడివరం మార్కెట్ యాడ్ లో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం.

తూర్పుగోదావరి జిల్లా: ముమ్మిడివరం  మార్కెట్ యాడ్ లో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం.

ముమ్మిడివరం మార్కెట్ యాడ్ లో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం మండల మహిళా సమాఖ్య ముమ్మిడివరం అధ్యక్షురాలు గుత్తాల సునంద ఆధ్వర్యంలో మండల పరిషత్ అధికారి డి .రాంబాబు అధ్యక్షతన వైయస్సార్ ఆసరా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్. హాజరయ్యి, జ్యోతి ప్రజ్వలన చేసి వైయస్సార్ ఆసరా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ మహిళా స్వావలంబన సాధికారతే ద్యేయంగా ఎన్నికల నాటికి ఉన్న డ్వాక్రా రుణాలని చెల్లిస్తామని హామీ ఇచ్చి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలు రైతు భరోసా, వైయస్సార్ వాహనమిత్ర, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, వైయస్సార్ చేదోడు, వైయస్సార్ విద్యా దీవెన, వైయస్సార్ ఆసరా, వైయస్సార్ చేయూత ఇలాంటి ఎన్నో గొప్ప పధకాలు ప్రవేశపెడుతూ అంకితభావంతో సీఎం జగన్ మోహన్ రెడ్డి పని చేస్తున్నారని తెలియజేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం ఎప్పుడు కూడా పేదల కోసం పని చేసిన కుటుంబం అని తండ్రి బాటలో కొడుకు జగన్ మోహన్ రెడ్డి నడుస్తున్నారని ఎంఎల్ఎ గుర్తు చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో తండ్రని మించిన తనయుడు ఇంతవరకు ఏ రాష్ట్రంలోనూ ఇంత గొప్ప స్థాయిలో ఏ ముఖ్యమంత్రికి మద్దతు ప్రజలు పలకలేదని కాని ఆంధ్ర రాష్ట్రంలో 151 సీట్లతో వైయస్ఆర్ పార్టీని ప్రజలు గెలిపించారని తన సంతోషాన్ని వ్యక్తపరిచారు.
అదే విధంగా వైఎస్ఆర్ ఆసరా మొదటి విడతలో భాగంగా ముమ్మిడివరం మండల పరిధిలోని 971సంఘాలకు గాను 10064 మంది సభ్యులకు మొదటి విడతగా 6,99,38016 రూపాయల చెక్కును శాసనసభ్యులు పొన్నాడ సతీష్ కుమార్ విడుదల చేశారు. అనంతరం ముమ్మిడివరం మార్కెట్ వీధిలో వై య ఆర్ ఆసరా లబ్ది తో నూతనంగా ఏర్పాటుచేసిన కిరాణా వర్తక వ్యాపారాన్ని స్థానిక శాసనసభ్యులు ప్రారంభించారు. ఈకార్యక్రమంలో ముమ్మిడివరం మండలం ఎం‌పి‌డి‌ఓ డి రాంబాబు, మండల మహిళా సమైక్య ఏపీఎం సూర్యారావు, సీసీ లు కే.డి.వి ప్రసాద్ ,ఆకుల శ్రీనివాసరావు అవనిగడ్డ శ్రీనివాస్ , వైఎస్ఆర్సిపి టౌన్ కన్వీనర్ బొంతు సత్య శ్రీనివాస్, మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి కమిడి ప్రవీణ్, కోలా బాబ్జీ , ముమ్మిడివరం పంచాయతీ సెక్రెటరీ, సచివాలయం సిబ్బంది, మండల మహిళా సమైక్య అకౌంటెంట్ భవాని, డ్వాక్రా వివోఏలు, వివో లు పార్టీ కార్యకర్తలు, ఆసరా లబ్ధిదారులు పాల్గొన్నారు.

A1TV తెలుగు న్యూస్
తూర్పుగోదావరి జిల్లా
ముమ్మిడివరం రిపోర్టర్: సునిల్ శాస్త్రి – 9392919477.

Related posts