Select your Top Menu from wp menus
Breaking News

చిత్తూరు జిల్లా: మదనపల్లె ప్రభుత్వ భూములలో అక్రమంగా నిర్మణాలు చేపట్టితే కఠిన చర్యలు తీసుకుంటాము – సబ్ కలెక్టర్ యం.జాహ్నవి.

చిత్తూరు జిల్లా: మదనపల్లె   ప్రభుత్వ భూములలో అక్రమంగా నిర్మణాలు చేపట్టితే కఠిన చర్యలు తీసుకుంటాము – సబ్ కలెక్టర్ యం.జాహ్నవి.

మదనపల్లె ప్రభుత్వ భూములలో అక్రమంగా నిర్మణాలు చేపట్టితే కఠిన చర్యలు తీసుకుంటామని మదనపల్లి సబ్ కలెక్టర్ యం.జాహ్నవి పేర్కొన్నారు.బుధవారం ఉదయం తహశీల్దార్ తో కలసి మదనపల్లి మండలం, మున్సిపాలిటీ పరిధిలోని వెంకప్ప కోట సర్వే నెంబరు 3,చంద్రా కాలనీ 5 33 ,అనప్పగుట్ట 534 బి.కె.పల్లి 410,,516,517, ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూములను పరిశీలించారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ మదనపల్లి మండలంలో ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురైందని కొందరు అర్జీలద్వారా సబ్ కలెక్టర్ అందజేయడం జరిగిందని దీని పై నివేదిక అందజేయాలని తహశీల్దార్ ను అదేశించడమైనది తెలిపారు. ఆదాని ప్రకారంగా ఈరోజు ప్రభుత్వ భూములను పరిశీలించడం జరిగిందని తెలిపారు. ఎవ్వరైనా ప్రభుతం భూములు ఆక్రమించిన అక్రమంనగా నిర్మాణాలు చేపట్టిన వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటి కే ప్రభుత్వ భూములలో అక్రమ కట్టడాలను తొలగించడం జరిగిందన్నారు.ప్రభుత్వ భూముల్లో అక్రమాలకు గురివుతుంటే,అక్రమంగా నిర్మాణాలు జరుగుతుంటే వి ఆర్ ఓ లు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు.తహసీల్దార్ సురేష్ బాబు, సర్వేయర్,వి ఆర్ ఓ లు పాల్గొన్నారు.

A1TV తెలుగు న్యూస్
చిత్తూరు జిల్లా.
జిల్లా స్టాఫ్ రిపోర్టర్: షేక్ కరీముల్లా. – 9392919678.

Related posts