Select your Top Menu from wp menus
Breaking News

విశాఖ జిల్లా: జీవో న 3 రిజర్వేషన్లు రక్షణకు పార్లమెంట్ వర్సకాలసమావేశంలో చట్టబద్ధత కల్పించుటకు చర్యలు తీసుకోవాలి – గిరిజన సంగం డిమాండ్.

విశాఖ జిల్లా: జీవో న 3 రిజర్వేషన్లు రక్షణకు పార్లమెంట్ వర్సకాలసమావేశంలో చట్టబద్ధత కల్పించుటకు చర్యలు తీసుకోవాలి – గిరిజన సంగం డిమాండ్.

జీవో నం:3 రిజర్వేషన్లు చట్టబద్ధత కల్పించెవిదంగా పార్లమెంట్ వర్సకలసమావేశంలో గిరిజన ఎంపీలు మరియు రాష్ట్రప్రభుత్వం తరపున కేంద్రప్రభుత్వనికి ఒత్తిడి చెయ్యాలని గిరిజన సంగం డిమాండ్ చేస్తుంది. ఈ రోజు గిరిజనసంగం రాష్ట్రాకమిటి పిలుపుమేరకు అరకువేలి మెయిన్ రోడ్డువద్ద నిరసన ప్రదర్శన చెయ్యడం జరిగింది. నిరసన ప్రదర్శనకు ముఖ్య అతిథిగా పాల్గొన్న గిరిజనసంగం రాష్ట్ర ఉపాధ్యక్షులు కిల్లోసురేంద్ర మాట్లాడుతూ పార్లమెంట్ వర్షకాల సమావేశంలో జీవో న 3 రిజర్వేషన్లు రక్షణకు చట్టబద్ధత కల్పించాలని జీవోన 3 రిజర్వేషన్లు చట్టబద్ధత కల్పించుటకు గిరిజన ఎంపీలు మరియు రాష్ట్ర ప్రభుత్వం తరపున పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రప్రభుత్వనికి ఒత్తిడి చెయ్యాలని డిమాండ్ చెయ్యడమైనది.
కేంద్రప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో రిజర్వేషన్లు,గిరిజన హక్కులు చట్టాలు కాపాడే బాధ్యత కేంద్రానికి ఉన్నప్పటికీ సుప్రీంకోర్టులో జీవో న 3 పై రివ్యూ పిటీషన్ వెయ్యలేదని జీవో న 3 పై కేంద్రప్రభుత్వం సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని డిమాండ్ చెయ్యడమైనది రాష్ట్రప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర గడిచిన ఏజెన్సీస్పెషల్ డిఎస్సి తియ్యలేదు. పాడేరు ఏజెన్సీలోని వేలమంది బీఈడీ,డైట్,అభ్యర్థులు గిరిజన స్పెషల్ డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నారు తక్షణమే గిరిజన డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చెయ్యడం జరిగింది ఈకార్యక్రమంలో గిరిజనసంగం మండలకార్యదర్శి పి.రామన్న గిరిజనసంగం నాయకులు కె.రామారావు కె.ప్రసాద్.కె.దిశ్మంత్ పాల్గొన్నారు.

A1TV తెలుగు న్యూస్
విశాఖపట్నం జిల్లా.
అరకు వ్యాలీ రిపోర్టర్: త్రినాధ్ – 9392919457.

Related posts