Select your Top Menu from wp menus
Breaking News

తూర్పు గోదావరి జిల్లా: మెడికల్ కాలేజీ కోసం దళిత పేటను కాలీచేయించ వద్దు – సి.పి.ఎం పార్టీ డిమాండ్

తూర్పు గోదావరి జిల్లా:  మెడికల్ కాలేజీ కోసం దళిత పేటను కాలీచేయించ వద్దు – సి.పి.ఎం పార్టీ డిమాండ్

అమలాపురం రూరల్ మండలం కామనగరువు బడుగువారిపేట దళిత పేటలో మెడికల్ కాలేజీ కోసం బలవంతంగా మా ఇళ్లు కుాల్చవద్దని మాభుములు లాక్కోవద్దని సిపిఎం పార్టీ మరియు ప్రజాసంఘాల ఆద్వర్యంలో గ్రామస్తులు సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి విశ్వరూప్ ను కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మంత్రి స్పందిస్తూ మీకు అంటే గ్రామస్తులకు ఇష్టం లేకుండా ఒక్క సెంటు భుామికూడా ప్రభుత్వం తీసుకోదని హామీ ఇవ్వడం జరిగింది ఈసందర్బంగా సిపిఎం పార్టీడివిజన్ కార్యదర్శి కార్య వెంకటేశ్వరరావు మరియు గ్రామస్తులు మాట్లాడుతూ మెడికల్ కాలేజీ రావడానికి తాము వ్యతిరేఖంకాదని అందరికీ అనువైన ప్రాంతంలో ప్రజలకు ఎవరికీ ఇబ్బందులు లేని ప్రాంతంలో స్ధల సేకరణ చేయాలని విజ్ఞప్తి చేసారు తరతరాలుగా ఇక్కడే మా తాతల ముత్తాతల నుంచి జీవనం సాగిస్తున్నామని మా కుటుంబాలు బంధు వర్గాలు అంతా ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నారని మెడికల్ కాలేజీ కోసం ఇపుడు మా జీవితాలను నాశనం చేయొద్దని ఈ పంట పొలాల మీదే ఆధారపడి మా కుటుంబాలు జీవనం సాగిస్తున్నారని అటువంటి భూములు మా ఇల్లు కూలగొట్టి బలవంతంగా లాక్కోవాలని చూస్తున్నారని మంత్రి కి తెలిపారు సిపిఎం పార్టీ వెంకటేశ్వర మాట్లాడుతూ గ్రామంలోనూ మండలంలోను అనేక భూములు పనికిరాని భూములు ఉండగా దళితులు నివాసముంటున్న ఇల్లు తో దళితుల భూములు మెడికల్ కాలేజీ కి అవసరమైన అని ప్రశ్నించారు మెడికల్ కాలేజీ కోసం బలవంతంగా భూములు గాని ఇల్లు గాని కూల్చే ప్రయత్నం చేస్తే ఉద్యమం తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు కెవిపిఎస్ నాయకులు పి వసంత్కుమార్ ఐద్వా నాయకురాలు టీ నాగ వరలక్ష్మి. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు రైతులు నక్కా మురళీకృష్ణ పందిరి శ్రీహరి మాకే శ్రీనివాసరావు నక్క దుర్గారావు పెయ్యల దుర్గాప్రసాద్ గంటి ఆనందం గంటి గణేష్ గొల్లపల్లి శ్రీను గొల్లపల్లి శశిరేఖ కందేరి మూల స్వామి గొల్లపల్లి దుర్గారావు బడుగు సత్యనారాయణ గ౦టి సంధ్యారాణి వాకపల్లి సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

A1TV తెలుగు న్యూస్
తూర్పుగోదావరి జిల్లా
అమలాపురం రిపోర్టర్: త్రిమూర్తులు – 9392919478.

Related posts