Select your Top Menu from wp menus
Breaking News

శ్రీకాకుళం జిల్లా: ప్రతి ఒక్క కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి – రాష్ట్ర మత్స్య, పాడి పరిశ్రమ శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు.

శ్రీకాకుళం జిల్లా: ప్రతి ఒక్క కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి –  రాష్ట్ర మత్స్య, పాడి పరిశ్రమ శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు.

పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో కాశిబుగ్గ లోని వైయస్సార్ స్క్వేర్ వద్ద బుధవారం నిర్వహించిన వైయస్సార్ ఆసరా వారోత్సవాల్లో మంత్రి పాల్గొని మాట్లాడారు. ఆద్యంతం చలోక్తులు విసురుతూ మహిళలతో సభలో మాట్లాడిస్తూ వారి కష్టనష్టాలను తెలుసుకున్నారు. చంద్రబాబు ఇచ్చిన హక్కులను జగనన్న తీర్చడం మహిళల పట్ల ఆయనకున్న గౌరవానికి నిదర్శనమని పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న ఈ సొమ్మును వృధా చేయవద్దని, చిరు వ్యాపారాలు చేసుకునే ఆర్థిక స్వావలంబన సాధించాలని కోరారు. పెరటి కోళ్ల పెంపకం, పాడి పరిశ్రమ లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇటీవల కాలంలో రిలయన్స్, తదితర కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది అని, మీ ఉత్పత్తులను విక్రయించుకునే వెసులుబాటు కూడా ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని తొమ్మిది లక్షల మంది మహిళలకు సుమారు 6 వేల 500 కోట్ల రూపాయలు వైయస్సార్ ఆసరా పథకం లో అందిస్తున్నామని చెప్పారు.

A1TV తెలుగు న్యూస్
శ్రీకాకుళం జిల్లా
శ్రీకాకుళం రిపోర్టర్: ఎం.కళ్యాణ చక్రవర్తి – 9392919427.

Related posts