Select your Top Menu from wp menus
Breaking News

తూర్పుగోదావరి జిల్లా: బహుముఖప్రజ్ఞాశాలిగా మానవ హక్కుల కోసం జీవితాంతం పోరాడిన యోధుడు బొజ్జా తారకం – ఆర్పీఐ, ప్రజాసంఘాల నేతలు.

తూర్పుగోదావరి జిల్లా:  బహుముఖప్రజ్ఞాశాలిగా మానవ హక్కుల కోసం జీవితాంతం పోరాడిన యోధుడు బొజ్జా తారకం – ఆర్పీఐ, ప్రజాసంఘాల నేతలు.

న్యాయశాస్త్ర కోవిధుడిగా, కవిగా, రచయితగా, బహుముఖప్రజ్ఞాశాలిగా మానవ హక్కుల కోసం జీవితాంతం పోరాడిన యోధుడు బొజ్జా తారకం అని ఆర్పీఐ, ప్రజాసంఘాల నేతలు కొనియాడారు. బుధవారం తారకం 4వ వర్థంతి సందర్భంగా స్థానిక పోలమ్మచెరువు గట్టు (మినీ ట్యాంక్ బండ్)వద్ద ప్రజా సంఘాల అద్వ్యర్యంలో తారకం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన ని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆర్పీఐ నాయకులు పెనుమాల సుధీర్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ బి.ఆర్.అంబేడ్కర్ స్ఫూర్తితో తారకం విద్యార్థి దశ నుండి సమాజంలోని అసమానతలు పై పోరాటం చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ, ఎస్టీ, బిసి మైనార్టీల పై ఎక్కడ అన్యాయం జరిగినా వారి పక్షణా పోరాడి భాదితులకు న్యాయం చేకూర్చిన యోదుడన్నారు. పెయ్యల పరశురాముడు మాట్లాడుతూ తారకం 2001లో “భూమిని పంచు.. బడ్జెట్ పెంచు” అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి వందలాది ఎకరాలు పేదలకు పంచేలా అప్పటి ప్రభుత్వాల పై ఒత్తిడి తీసుకురావడమే కాకుండా, కోనసీమలో ఏటిగట్ల వెంబడి ఉన్న కొబ్బరి చెట్లను ప్రతి పేదవాడికి పంచాలనే డిమాండ్ తో కోనసీమ వ్యాప్తంగా పాదయాత్ర చేశారన్నారు. తారకం సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యడ్ల చిట్టిబాబు, కాశి సింహాద్రివర్యా, కె.ఎల్.వి.ప్రసాద్, నల్లా కొండల రావు, సఖిలే సూర్యనారాయణ లతో పాటు ఆర్పీఐ కార్యకర్తలు, తారకం అభిమానులు పాల్గొన్నారు.

A1TV తెలుగు న్యూస్
తూర్పుగోదావరి జిల్లా
ముమ్మిడివరం రిపోర్టర్: సునిల్ శాస్త్రి – 9392919477.

Related posts