Select your Top Menu from wp menus
Breaking News

చిత్తూరు జిల్లా: కరాటే మాస్టర్స్ కుటుంబాలను ఆదుకోవాలి.

చిత్తూరు జిల్లా: కరాటే మాస్టర్స్ కుటుంబాలను ఆదుకోవాలి.

హెల్పింగ్ హ్యాండ్ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్ వెల్ఫేర్ సొసైటీ ఇండియా వైస్ చైర్మన్ కీసరం పరంజ్యోతి( జపాన్ షిటోరియో కరాటే స్కూల్ జిల్లా చీఫ్ ఇన్ స్ట్రక్టర్, కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా నేషనల్ జడ్జి),
కరోనా మహమ్మారి నేపథ్యంలో గత ఐదు నెలలుగా కరాటే మాస్టర్స్ ఉపాధి కోల్పోయారు. చిత్తూరు జిల్లాలో సుమారు 500 కుటుంబాలు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రమంతటా మూడు వేల కుటుంబాలు ఉపాధి కోల్పోయారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వులు మేరకు ప్రభుత్వ పాఠశాలలలో పిల్లలకు సెల్ఫ్ డిఫెన్స్, ఆత్మరక్షణ కళ కరాటే నేర్పిస్తూ ఎందరో కరాటే మాస్టర్ లు ఉన్నారు. కరోనా ప్రభావం వలన మా యొక్క జీవితాలు దుర్భరంగా మారాయి. కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేతి వృత్తి కళాకారులను ఎలా ఆదుకుంటూ ఉన్నారో అదేవిధంగా మార్షల్ ఆర్ట్స్, కరాటే ఆత్మ రక్షణ కళ విద్యను నేర్పిస్తున్న టువంటి మాస్టర్ లను ఆదుకోవాలని కోరుతున్నాము. ఒక్కో మాస్టర్ పై నలుగురైదుగురు కుటుంబ సభ్యులు ఆధారపడి జీవిస్తున్నారు. కరోనా వల్ల ఉపాధి లేక అనారోగ్యం పాలైన మాస్టర్లు ఎందరో ఉన్నారు. జిల్లాలో సుమారు 120 కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నట్లు సొసైటీ దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లు, టైలర్లు, ఇతర వృత్తిదారులకు ఆర్థిక సాయం అందించిన విధంగానే కరాటే మాస్టర్ లను కూడా ఆదుకోవాలని కోరుతున్నాము. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు, ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి గారు, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు కరాటే మాస్టర్ల సమస్యలను పరిశీలించి, వారి జీవితాల్లో వెలుగు నింపేలా ఆదుకోవాలని కోరుతున్నాము.

A1TV తెలుగు న్యూస్
చిత్తూరు జిల్లా.
పూతలపట్టు రిపోర్టర్: జయప్రకాశ్ – 8142422234.

Related posts