Select your Top Menu from wp menus
Breaking News

చిత్తూరు జిల్లా: నడిరోడ్డుపై కూతురి రోదనలకు కరగని ప్రజల మనసులు సకాలంలో వైద్యం అందక వృద్ధుడు మృతి.

చిత్తూరు జిల్లా:  నడిరోడ్డుపై కూతురి రోదనలకు కరగని ప్రజల మనసులు సకాలంలో వైద్యం అందక వృద్ధుడు మృతి.

ఈ హృదయ విధారక ఘటన పలమనేరు పట్టణం లో చోటు చేసుకుంది. కోవిడ్-19 వైరస్ భయం మానవత్వాన్ని మింగేస్తోంది. చావు బ్రతుకుల్లో ఉన్నవారిని చూసి, సాయం అందించడా నికి ఎవరూ ముందుకురాని సంఘటనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి, ఎవరైనా ప్రాణాపాయం లో ఉంటే కరోనా వ్యాధిగ్రస్తులు గానే భావించి సాయమందించడానికి జనం జంకిపోతున్నారు, ఈ భయమే ఓ వృద్ధుడి ప్రాణాన్ని తీసింది. కూతురి ఆర్తనాదాలను నిరుపయోగం చేసింది. వివరాల్లోకి వెళితే.
పలమనేరు నియోజకవర్గ గంగవరం మండలం కలగటూరుకు చెందిన వెంకటరామయ్య(73) శనివారం రాత్రి తన ఇంటి ముందు పడుకుని ఉండగా పక్కింటికి చెందిన ఆవు అతని గుండెలపై కాలుపెట్టి తొక్కింది. దీంతో అతని పక్కటెముకలు విరిగింది, బాధితులకు వైద్యం చేయించాలని ఆవు యజమానిని బాధిత కుటుంబ సభ్యులు అడిగినా పట్టించుకోలేదు. ఆదివారం ఉదయం అతని కుమార్తె హేమలత తండ్రిని ..పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చింది. వారు అతన్ని పరిశీలించి స్కానింగ్ చేయాలని, తమవద్ద స్కానింగ్ సౌకర్యం లేదని చెప్పి వెనక్కి పంపించారు. పేదరాలైన ఆమె చేసేదిలేక తన తండ్రిని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చూపెట్టి ఇంటికి తీసు కెళ్లింది. బుధవారం ఆయనకు ఊపిరి తీసుకో వడం కష్టం కావడంతో మళ్లీ ఆటోలో ప్రైవేటు ఆసుపత్రికి తీసుకొచ్చింది. అక్కడ డాక్టర్ అందు బాటులో లేకపోవడంతో ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాలని భావిస్తుండగా వృద్ధుడు ఆటోలో నే ప్రాణం వదిలాడు. దీన్ని గమనించిన ఆటో డ్రైవర్ శవాన్ని రోడ్డుపై వదిలి వెళ్లిపోయాడు. అయ్యా మా తండ్రి ఆవు తొక్కి చనిపోయాడు కరోనా కాదు. సాయం చేయండి’ అని శవం ముందు మృతుని కుమార్తె ఆర్తనాదాలు చేసినా అక్కడి మనుషుల మనసులు కలుగలేదు మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఆమెను విచారించి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు.

A1TV తెలుగు న్యూస్
చిత్తూరు జిల్లా.
పలమనేరు రిపోర్టర్: ఎస్ నసీర్ – 9393888827.

Related posts