Select your Top Menu from wp menus
Breaking News

తూర్పుగోదావరి జిల్లా: కరోనాతో మృతి చెందిన జర్నలిస్టు భమిడిపాటికి ఘన నివాళి.

తూర్పుగోదావరి జిల్లా:  కరోనాతో మృతి చెందిన జర్నలిస్టు భమిడిపాటికి ఘన నివాళి.

అందరినీ ఏంతో ఆప్యాయతగా పలుకరిస్తూ నిన్న మొన్నటి వరకూ కలిసి మెలిసి తిరిగిన సీనియర్ జర్నలిస్టు భమిడిపాటి శ్రీనివాసరావు కరోనా మహమ్మారి సోకి అకాల మరణం చెందడం తోటి జర్నలిస్టులను ఎంతగానో కలచివేసిందని సీనియర్ జర్నలిస్టు పమ్మి నరేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని రావులపాలెంలో ఇటీవల కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన భమిడిపాటి శ్రీనివాసరావుకు ఆయనకు చెందిన రావులపాలెం సాయి జిరాక్స్ సెంటర్ వద్ద శనివారం జర్నలిస్టుల ఆధ్వర్యంలో సామాజిక దూరం పాటిస్తూ సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు మెర్ల శ్రీరామచంద్రమూర్తి భమిడిపాటి శ్రీనివాసరావు చిత్రపటానికి పూల మాలలు వేసి జ్యోతి వెలిగించి ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా పలువురు జర్నలిస్టులు శ్రీనివాసరావు చిత్రపటానికి పూల మాలలు వేసి నివాలులు అర్పించారు. శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెరవలి వెంకటేశ్వరరావు, బండి దత్తు, దారపరెడ్డి సత్యనారాయణ, సలాది గణేష్, కొండేటి గంగాధర్, చిర్రా నాగరాజు, గండ్రోతు దుర్గా సురేష్, దొండపాటి మూర్తి, యలగన బాలకృష్ణ, సి.హెచ్.నాగరాజు, సుంకర బాలాజీ, స్టూడియో సతీష్, చింతారావు యాదవ్, లలితా స్టూడియో శ్రీను తదితరులు పాల్గొన్నారు.

A1TV తెలుగు న్యూస్
తూర్పుగోదావరి జిల్లా
ఆత్రేయపురం రిపోర్టర్: కే ఆనంద్ – 9573686685.

Related posts