
ఆగస్టు 1 వ తేదీ నుంచి 7 తేదీ వరకు జరిగే “ప్రపంచ తల్లి పాల వారోత్సవాలు” సందర్భంగా, తల్లి పాల గొప్పతనాన్ని, అందులోని ఔషద విలువలు, ప్రపంచంలో చాలా దేశాల్లో తల్లి పాల కొరత సమస్యను, పుట్టిన బిడ్డకు పాలు అందకపోవడం వంటి విషయాలను వివరిస్తూ “డా.తోట శ్రీకాంత్ కుమార్” దర్శకత్వంలో రూపొందించిన “అమృతం – For Ever” అనే అవగాహన చిత్రం యొక్క పోస్టర్ ను ఈ రోజు 01/08/2020 తేదీన మనమందరం గర్వించే విధంగా, తన ఎన్నికల నామినేషన్ పత్రంలో కులం, మతం గురించి చెప్పకుండా భారతీయుడనని హైదరబాద్ – సనత్ నగర్ నియోజక వర్గం నుంచి M.L.A. అభ్యర్ధిగా పోటీ చేసిన “దేవేందర్ కొన్నే” గారు విడుదలచేశారు.” భేటీ బచావో – భేటీ పడవో మరియు సబ్కాసాథ్, సబ్కావికాస్, సభ్కావిశ్వస్ వేదిక” యువ మహిళ కన్వీనర్ “లావణ్య పండ్రే” మాట్లాడుతూ, నేడు చాలా మంది యువతులు తమ చంటి పిల్లలకు తల్లి పాలు ఇవ్వడంలేదని, ప్రతి తల్లి తన బిడ్డకు పాలు ఇచ్చి, బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో “అమృతం – For Ever” అవగాహన చిత్రం లో నటించిన నటి రామ సింధు, అక్షయ పాత్ర – ఐక్య కన్వీనర్ సాయి కిరణ్ గోనె, సినీ గేయ రచయిత రామారావు మాతుమూరు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
A1TV తెలుగు న్యూస్
హైదరాబాద్.