Select your Top Menu from wp menus
Breaking News

కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో నిర్మాణాలు పూర్తియిన గృహాలను పేదలకు ఇవ్వాలి – బీజేపీ నేత గండ్రోతు వీరగోవిందరావు.

కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో నిర్మాణాలు పూర్తియిన గృహాలను పేదలకు ఇవ్వాలి  – బీజేపీ నేత గండ్రోతు వీరగోవిందరావు.

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం కేంద్రప్రభుత్వ ఆర్థిక సహాకారంతో రాష్టంలో నిర్మాణాలు పూర్తియిన గృహాలను పేదలకు ఇవ్వాలని కోరుతూ బీజేపీ నేత గండ్రోతు వీరగోవిందరావు నిరసన వ్యక్తం చేశారు పేదలకు ఇళ్ళు కేటాయింపులో వైసిపి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా రాష్ట్ర బీజేపీ ఇచ్చిన పిలుపు మేరకు మండలంలోని ఈతకోటలో తన నివాసంలో ప్లకాబోర్డులతో నిరసన తెలియజేశారు ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విభజనతో నష్టపోయిన రాష్టానికి అన్ని రకాలుగా ఆదుకోవాలని ఉద్దేశ్యంతో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నరేంద్రమోదీ నాయకత్వంలో లక్షల సంఖ్యలో ఇళ్ళను మంజూరు చేసిందని గత తెలుగుదేశం ప్రభుత్వం అవినీతికి పాల్పడి కాలయాపన చేసిందని అధికారంలోకి వచ్చిన వైసీపీ కూడా టీడీపీపై అవినీతి ఆరోపణలు చేసి కూడా ఈ పద్నాలుగు నెలల కాలంలో గత ప్రభుత్వ అవినీతినీ వైసిపి ఎందుకు వేలికితీయడం తీయలేదని ప్రశ్నించారు పేదల సొంత ఇంటి కల నెరవేర్చేందుకు కేంద్రప్రభుత్వం నిధులు కేటాయించినప్పటికి పేదలకు ఇళ్ళు కేటాయింపులు జరపకుండా రాజకీయ కారణాలతో జగన్ మోహన్ రెడ్డి సర్కారు జాప్యం చేస్తు బాబుపై ఉన్న కక్షలను ప్రజలపై సాధిస్తున్నారన్నారు వైసిపి ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా బీజేపీ జనసేన ఆధ్వర్యంలో రెండు గంటలు పాటు ఎవరి ఇంటివద్ద వారే ప్లకార్డుతో నిరసనలు తెలియజేస్తు పేదవాడి సొంతింటి కల కోసం ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్నామన్నారు కేంద్రప్రభుత్వ లాక్ష్యానికి నాడు చంద్రబాబు నేడు జగన్ తూట్లు పొడుస్తు పేదల్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు కేంద్రం ఇస్తున్న నిధులు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా వాడుకున్న సరే పబ్లిసిటీ మాత్రం జగన్ చేసుకుంటున్నారన్నారు భారతీయ జనతా పార్టీ ప్రజల కోసమే పని చేస్తు పని చేసుకుంటు వెళ్తుందని నరేంద్రమోదీ నాయకత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలుతో ముందుకు సాగుతోందని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని రాష్ట్ర ప్రజానీకం అంతా గమనిస్తున్నారని చంద్రబాబు చేసిన తప్పులు జగన్ చేయకూడదని నిర్మాణాలు అయ్యినవి అవ్వాల్సిన వాటిపై దృష్టి పెట్టి గూడు లేని నిరు పేదలకు ఇచ్చి అండగా నిలవాలన్నారు.

A1TV తెలుగు న్యూస్
తూర్పుగోదావరి జిల్లా
ఆత్రేయపురం రిపోర్టర్: కే ఆనంద్ – 9573686685.

Related posts