Select your Top Menu from wp menus
Breaking News

నిడదవోలు నియోజక వర్గంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు పర్యటన.

నిడదవోలు నియోజక వర్గంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు పర్యటన.

పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉండ్రాజవరం మండలం పసలపూడి గ్రామంలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నీట మునిగిన నారుమడులు, వరి పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే పసలపూడి గ్రామం లోని గోడిచర్ల లాకుల్ని పరిశీలించి, స్థానిక రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అధికారులతో మాట్లాడి సమస్యని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. పెరవలి మండలం కానూరు గ్రామంలో ఎన్నో ఏళ్లుగా పూడిపోయిన కానూరు సబ్ కాలువను పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు వర్షం కారణంగా పంట కాలవ మునిగి పోవడంతో జెసిబి పెట్టి దగ్గరుండి పని చేయించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూడికతీత పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలతో నీట మునిగిన పంట పొలాలను నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు జి.శ్రీనివాస్ నాయుడు పరిశీలించి, ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, గ్రామ YSRCP నాయకులు, రైతులు పాల్గొన్నారు.

A1TV తెలుగు న్యూస్
పశ్చిమగోదావరి
నిడదవోలు రిపోర్టర్: సతీష్- 70325 24854
జిల్లా స్టాఫ్ రిపోర్టర్: ముద్రగడ భరత్-9966441833

Related posts