Select your Top Menu from wp menus
Breaking News

భారీ గా రవాణా అవుతున్న నిషేధిత ఖైని మరియు సిగరెట్స్ ని పట్టుకున్న పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి పోలీసులు.

భారీ గా రవాణా అవుతున్న నిషేధిత ఖైని మరియు సిగరెట్స్ ని పట్టుకున్న పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి పోలీసులు.

హైదరాబాద్ నుండి కాకినాడ కు భారీ గా రవాణా అవుతున్న నిషేధిత ఖైని మరియు సిగరెట్స్ ని పట్టుకున్నారు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు రూరల్ పెదవేగి పోలీసులు. జిల్లా ఎస్పీ కి రాబడిన సమాచారంతో పెదవేగి కూడలిలో వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు తెలంగాణా కు చెందిన ఒక లారీలో అక్రమంగా రవాణా అవుతున్న 56 బస్తాల్లోని సుమారు పది లక్షల డెబ్భై వేల రూపాయల విలువగల నిషేధిత ఖైని మరియు సిగరెట్స్ ని గుర్తించారు. అక్రమ రవాణా చేస్తున్న లారీ తో పాటు సరుకుని స్వాధీన పర్చుకుని హైదరాబాద్ లోని హయత్ నగర్ కి చెందిన లారీ డ్రైవర్ కసవరాజు. దయానంద్ ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు ట్రైనీ డీ.ఎస్పీ హర్షిత తెలిపారు. ఈ సందర్భంగా అక్రమ రవాణా ని అడ్డుకోవటంలో ప్రతిభ కనబర్చిన ఏలూరు రూరల్ సిఐ. శ్రీనివాస్, పెదవేగి ఎస్సై నాగ వెంకట రాజు, HC-1736 అమీర్,PC-173 సతీష్, PC-704 కిషోర్, PC-2084 నాగూర్ సాహెబ్, PC-810 సుధీర్, PC-2096 వెంకటేశ్వర రావు ని జిల్లా పోలీస్ శాఖ తరపున ట్రైనీ డీ.ఎస్పీ హర్షిత అభినందించారు.

A1TV తెలుగు న్యూస్
పశ్చిమగోదావరి జిల్లా
జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ముద్రగడ భరత్- 9966441833.

Related posts