Select your Top Menu from wp menus
Breaking News

కరోనా వైరస్ నివారణ కోసం చేస్తున్న పోరాటంలో జర్నలిస్టులు ప్రాణాలకు తెగించి అందిస్తున్న సేవలు అభినందనీయం.

కరోనా వైరస్ నివారణ కోసం చేస్తున్న పోరాటంలో జర్నలిస్టులు ప్రాణాలకు తెగించి అందిస్తున్న సేవలు అభినందనీయం.

కరోనా వైరస్ నివారణ కోసం చేస్తున్న పోరాటంలో జర్నలిస్టులు ప్రాణాలకు తెగించి అందిస్తున్న సేవలు అభినందనీయం అని భారత్ వికాస్ పరిషత్ తూర్పు గోదావరి జిల్లా, రావులపాలెం గౌతమి శాఖ సభ్యులు పేర్కొన్నారు. భారత్ వికాస్ పరిషత్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక గౌతమి శాఖ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు శానిటైజర్లు, మాస్కులు, బిస్కెట్లు పంపిణీ చేశారు. 1963లో తమ సంస్థను స్థాపించారని, సంస్థ ద్వారా అందించే సేవా కార్యక్రమాల్లో భాగంగా సమాజానికి విలువైన సేవలు అందిస్తున్న జర్నలిస్టులకు తమ వంతుగా వీటిని అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భారత్ వికాస్ పరిషత్ గౌతమి శాఖ అధ్యక్షుడు మండవిల్లి వెంకన్న బాబు, ఎస్విఆర్ కృష్ణారెడ్డి, సి.హెచ్.వి. సుబ్బరాజు, మార్కండేయులు తదితరులు పాల్గొన్నారు.

A1TV తెలుగు న్యూస్
తూర్పుగోదావరి జిల్లా
ఆత్రేయపురం రిపోర్టర్: కే ఆనంద్ – 9573686685.

Related posts