Select your Top Menu from wp menus
Breaking News

“గారీబ్ కళ్యాణ్ అన్న యోజన” కింద తెల్లరేషన్ కార్డ్స్ఇస్తున్న అదనపు ప్రయోజనాలను పర్యవేక్షించిన భేటీ బచావో – భేటీ పఢవో రాష్ట్ర అధ్యక్షుడు డా.తోట శ్రీకాంత్ కుమార్.

“గారీబ్ కళ్యాణ్ అన్న యోజన” కింద  తెల్లరేషన్ కార్డ్స్ఇస్తున్న అదనపు ప్రయోజనాలను పర్యవేక్షించిన భేటీ బచావో – భేటీ పఢవో రాష్ట్ర అధ్యక్షుడు డా.తోట శ్రీకాంత్ కుమార్.

మన కేంద్ర ప్రభుత్వం కరోనా విపత్తు సమయంలో దేశ వ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డ్స్ కలిగిన 80 కోట్ల మందికి, ప్రతి నెల వారు తీసుకొనే కోటా రేషన్ తో పాటు, అదనంగా 5 కిలోల బియ్యం, కుటుంభానికి అదనంగా 1 కిలో కందిపప్పు ఉచితంగా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ద్వారా “గారీబ్ కళ్యాణ్ అన్న యోజన” కింద అందిస్తున్నారు. ఈ పథకాన్ని 2020 వ సంవత్సరం నవంబర్ నెల వరకు పొడిగించడం జరిగింది. ఈ రోజు (10/07/2020) ” భేటీ బచావో – భేటీ పఢవో మరియు సబ్కాసాథ్, సబ్కావికాస్, సభ్కావిశ్వస్ వేదిక” రాష్ట్ర అధ్యక్షుడు డా.తోట శ్రీకాంత్ కుమార్, జనరల్ సెక్రెటరీ అశోక్ రాథోడ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ దేవేందర్ కొన్నే బృందం మన తెలుగు రాష్ట్రాల్లో ఈ పథకం అమలు గురించి కొన్ని రేషన్ షాప్స్ పర్యటించి లబ్దిదారులకు అదనపు రేషన్ అందుతున్నాయా అన్న విషయం తో పాటు, కేంద్ర ప్రభుత్వం అదనంగా ఇస్తున్న రేషన్ వివరాలు లబ్దిదారులకు తెలియజేశారు.

A1 తెలుగు న్యూస్
హైదరాబాద్.

Related posts