Select your Top Menu from wp menus
Breaking News

గురుకుల పాఠశాల కు వెళ్లే రహదారి మెరుగుపర్చాలి: మందపాటి కిరణ్ కుమార్

గురుకుల పాఠశాల కు వెళ్లే రహదారి మెరుగుపర్చాలి:  మందపాటి  కిరణ్  కుమార్

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం నరేంద్రపురం గ్రామ పంచాయతీ పరిధిలో గల పోలంపేటలో ఉన్న గురుకుల పాఠశాల కు వెళ్లే రహదారి ఎంతో అధ్వానంగా తయారైందని. ఆ రహదారిలో వెళ్లేటప్పుడు మోటార్ వాహనాలు అదుపు తప్పి కింద పడిపోవడం జరుగుతుందని. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి గురుకుల పాఠశాల కు రహదారి సరిగ్గా లేకపోవడం బాధాకరమని టిడిపి నాయకుడు మందపాటి కిరణ్ కుమార్ పేర్కొన్నారు. వెంటనే రహదారిని సాంక్సన్ చేయించి మంచి రహదారిని వేయాలని మందపాటి కిరణ్ తెలిపారు. అనంతరం గురుకుల పాఠశాల నందు ఆర్ఓ ప్లాంట్, ప్రహరీ వాల్ ను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

A1TV తెలుగు న్యూస్
తూర్పుగోదావరి జిల్లా
రిపోర్టర్: ధనరాజు – 9154279470.

Related posts