Select your Top Menu from wp menus
Breaking News

డ్రగ్ వ్యసనాలతో ఉజ్వల భవిష్యత్తు అంధకారం చేసుకోవద్దు రాయవరం ఎస్సై ఎల్ శ్రీను నాయక్.

డ్రగ్ వ్యసనాలతో ఉజ్వల భవిష్యత్తు అంధకారం చేసుకోవద్దు రాయవరం ఎస్సై ఎల్ శ్రీను నాయక్.

డ్రగ్ వ్యసనాలతో యువత తమ ఉజ్వల భవిష్యత్తును పాడు చేసుకున్నారంటూ రాయవరం ఎస్సై ఎల్. శ్రీను నాయక్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన రాయవరం పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదకద్రవ్యల( డ్రగ్స్ )వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని రాయవరం పోలీస్ స్టేషన్ వద్ద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై శ్రీను నాయక్ యువతను ఉద్దేశించి మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలు ను ఉన్నత చదువు లు చదివించి ఉన్నత ఉద్యోగాలు కు పంపించాలని ఆకాంక్షతో చదివిస్తున్నారు. కాని నేటి తరం యువత కోంత మంది డ్రగ్స్ కి గురై మంచి ప్రవర్తనతో వున్న యువతను కూడా పాడుచెస్తున్నారు. డ్రగ్స్ కి బానిసై మహిళలను పైశాచికంగా హింసించడం, హత్య లు చెయ్యటం ఎక్కువగా జరుగుతున్నాయి. అవసరానికి డబ్బు లెక దొంగతనాలకు అలవాటు పడుతున్నారు. కోవిడ్-19లోప్రజలు పోలీస్ అదికారుల, ప్రభుత్వ అధికారుల సూచనలను తప్పక పాటించాలని పలుపునిచ్చారు. పిల్లల ప్రవర్తనలో ముఖ్యంగా తల్లిదండ్రులు దృష్టి చారించవలసిన అవసరం ఎంతో ఉందని, ధనికులు, ఉన్నత ఉద్యోగులు తమ పిల్లలను విచ్చలవిడిగా వదిలి వెయ్యడం తో డ్రగ్స్ కి, మద్యం కి అలవాటు పడి భద్రత నిబంధన లు విస్మరించి తమ వాహనాలు నడపటం తో చాలా మంది మరణించడం జరుగుతుంది. కావున డ్రగ్స్ ను నిరోధించటం లో ప్రజలు చొరవ తీసుకోవాలని ఎస్సై కోరారు. అనంతరం పోలీసులు రాయవరం పోలీస్ స్టేషన్ నుండి మెయిన్ రోడ్డు ద్వారా ర్యాలీ నిర్వహించి నినాదాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ పి. బాలసుబ్రమణ్యం, అసిస్టెంట్ రైటర్ రొక్కల శ్రీనివాస్, కానిస్టేబుల్ మహేష్, రాజు, మహిళా కానిస్టేబుల్స్, ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.

A1TV తెలుగు న్యూస్
తూర్పుగోదావరి జిల్లా
మండపేట రిపోర్టర్: జాన్సన్ – 9949037217

Related posts