Select your Top Menu from wp menus
Breaking News

” పెంగ్విన్” తెలుగు మూవీ సమీక్ష..!!

” పెంగ్విన్” తెలుగు మూవీ సమీక్ష..!!

సమీక్ష : ‘పెంగ్విన్’ –  పర్వాలేదనిపించే సస్పెన్స్ థ్రిల్లర్ !

రిలీజ్: 2020-06-19.

ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో

 

తారాగణం : కీర్తి సురేష్, లింగా, మాస్టర్ అద్వైత్, తదితరులు

రచన&దర్శకత్వం : ఈశ్వ‌ర్ కార్తీక్

సంగీతం : సంతోష్ నారాయణన్

నిర్మాత : కార్తీక్ సుబ్బ‌రాజు

సినిమాటోగ్రఫి: కార్తీక్ పళని

ఎడిటింగ్: అనిల్ క్రిష్

 

మ‌హాన‌టి ఫేమ్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెర‌కెక్కిన చిత్రం ‘పెంగ్విన్’. ఈశ్వ‌ర్ కార్తీక్ దర్శకత్వం వహించారు. అమెజాన్ ప్రైమ్ స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, ప్యాష‌న్ స్టూడియోస్ ప‌తాకం పై నిర్మాత కార్తీక్ సుబ్బ‌రాజు ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీ ఓ‌టి‌టి లో ఈ రోజు విడుదల అయింది. మరి ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం.

మూల కథ:

రిథమ్ (కీర్తీ సురేష్) తన కొడుకు అజయ్ (మాస్టర్ అద్వైత్)ను చార్లిచాప్లిన్ వేషంలో వచ్చిన ఓ వ్యక్తి ఎత్తుకెళ్తాడు. కొడుకు దూరం అయిన ఆరు సంవత్సరాల తరువాత రిథమ్ ఏడు నెలల గర్బావతిగా ఉన్నప్పుడూ తప్పిపోయిన అజయ్ దొరుకుతాడు. ఈ క్రమంలో తన కొడుకు మానసిక స్థితి బాగలేక పోవడంతో అసలు తనని  ఎవరు ఎత్తుకెళ్లారు, ఎందుకు ఎత్తుకెళ్లారు, తనతో పాటు ఇన ఎవరెవరు ఉన్నారు, ఆ చార్లిచాప్లిన్ ముసుగు వెనక ఉన్న వ్యక్తి ఎవరు అనే అంశం పై రిథమ్ గర్భవతిగా పడే మానసిక క్షోబ పై నడిచే   సస్పెన్స్ థ్రిల్లర్.

ప్లస్ పాయింట్స్ :

  1. కీర్తి సురేష్ నటన
  2. మాస్టర్ అద్వైత్ నటన
  3. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్ :

  1. కథ, కథనాలు
  2. డైరెక్షన్
  3. ఎమోషనల్‌గా ఆకట్టుకోలేకపోవడం.

తీర్పు :

సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రం కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు సెకెండ్ హాఫ్ లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలు సినిమాని చూసేలా చేస్తాయి. కమర్షియల్ అంశాలు పెద్దగా లేకపోవడం వలన రెగ్యులర్ సినిమా మైండ్ సెట్ ఉన్నఆడియన్స్ ని మెప్పించక పోయిన కొత్తదనం కోరుకునే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

 

Reviewed by

 “ Pappu Balaji Reddy”

(A1tv telugu News)

Related posts