Select your Top Menu from wp menus
Breaking News

మండే అగ్నిగోళంలా యలమంచిలి లో ఆకాశ దర్శనం.

మండే అగ్నిగోళంలా యలమంచిలి లో ఆకాశ దర్శనం.

యలమంచిలి ప్రజలు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. అదేమంటే విశాఖపట్నం జిల్లా యలమంచిలి లో ఉన్నట్టుండి ఆకాశమంతా ఎర్రబడింది. ఎరుపురంగులో ఆకాశం చాలా అందంగా ఆహ్లాదకరంగా దర్శనమిచ్చింది. అసలే యలమంచిలి చుట్టంతా ప్రకృతి ఎంతో అందంగా హాయిగా కనువిందు చేస్తుంటుంది. ప్రకృతి అందాలు ఎంతగానో పరవశింప జేస్తాయి. ఒక్కసారిగా ఆకాశం ఎరుపురంగులోకి మారిపోవడంతో ఆ దృశ్యం చూపరులకు ఎర్రచీర కప్పుకున్నట్లుగా సాయం సంధ్య వేళ దర్శనమించ్చింది. దీంతో ప్రకృతి ప్రియులు ఆ దృశ్యాన్ని చూస్తూ ఎంతగానో మంత్రముగ్దులయ్యారు. ఎన్నడూ చూడని అద్భుతమైన అరుదైన దృశ్యాన్ని చూడటంతో యలమంచిలి వాసులు ఒక్కసారిగా ఎంతో ఆహ్లాదభరితమైన క్షణాలను అనుభవిస్తున్నట్లుగా అనభూతి చెందారు.

అయితే ఒక్కసారిగా అక్కడి ఆకాశంలో అగ్నిగోళంలో ఎర్రగా మండిపడుతూ దర్శనమివ్వడంతో ప్రజలంతా అయోమయానికి గురయ్యాకు. ఏమిటి ఆకాశంలో ఇంత మార్పు అసలేం జరుగుతుంది యలమంచిలి లో. ఇది ప్రకృతి కాంత కొత్త పుంతలా లేక వాతావరణంలో వచ్చిన మార్పులు కారణంగా వచ్చిన అగ్నిగోళం మండినట్లుగా కనపడే మార్పే అనే విషయంలో ప్రజలు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. అసలు యలమంచిలి, ఆ చుట్టూ పక్కల ప్రాంతాల వాసులు అంతా ఆ దృశ్యాన్ని చూస్తున్నంత సేపు మైమరచి పోవడమే కాకుండా తెలియని ఎప్పుడూ తట్టని ఆందోళనతో కూడిన ఆలోచనల పరంపర వారి మెదళ్లలో మొలిచి కొట్టిమిట్టాడాయి. అసలే కరోనా అపై లాక్ డౌన్ అంతలోనే ఎల్జీపాలిమర్స్ గ్యాస్ లీకేజీ వ్యవహారం అంతలోనే లాక్ డౌన్ సడలింపులలో భాగంగా విమానాశ్రయాలు తెరుచుకోవడం ఏంటి, ఇది ఈ ఆకాశంలోని మార్పుకు ఇలాంటి వాతావరణం ఏమైనా కారణమా అనే ఆలోచనలు యలమంచిలి వాసుల మెదళ్లలో తొలిచాయి. మరి ఏంటి అనేది తెలుసుకోవాలంటే అధికారుల వెల్లడి వినాల్సిందే.

A1TV

Visakhapatnam – Reporter
MD Ghouse
+916305757159.

Related posts