Select your Top Menu from wp menus
Breaking News

తనకల్లు అంధకారంలో ఇందిరానగర్..24 గంటలు గడుస్తున్నా అందని విద్యుత్…

తనకల్లు అంధకారంలో  ఇందిరానగర్..24 గంటలు గడుస్తున్నా అందని విద్యుత్…

అంధకారంలో
ఇందిరానగర్….

24గంటలు గడుస్తున్నా అందని విద్యుత్…

తనకల్లు మండల కేంద్రంలోని ఇందిరా నగర్ కాలనీ నందు బుధవారం 5 గంటల సమయంలో ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో అప్పటి నుండి గురువారం 5 గంటలు కావస్తున్నా విద్యుత్ అధికారులు ప్రజల సమస్యలను గాలికి వదిలేశారు. ఇందిరా నగర్ కాలనీ నందు సుమారు 400 కుటుంబాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పిల్లలు, పెద్దలు, ముసలి వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు సమస్యల గురించి తెలిపిన పట్టించుకోవడం లేదు అని ప్రజలు తెలిపారు. స్థానికంగా ఉండవలసిన లైన్ మెన్ ఉద్యోగులు లేకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని ప్రజలు వాపోయారు. మండల కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఏఈ రహులుళ్ల స్థానచలనం పై వెళ్లడంతో ఇక్కడి అదనపు బాధ్యతలు తీసుకున్న అధికారులు కూడా స్పందించడం లేదు. ఇందిరా నగర్ కాలనీ వాసులు ఈ రోజైనా విద్యుత్ సరఫరా అందుతుందా లేక ఈ రోజు కూడా చిమ్మచీకటిలో గడపల అన్న సందేహంలో ఉన్నారు.

Related posts