Select your Top Menu from wp menus

ఎమ్మెల్యే చేతులమీదుగా సచివాలయ నిర్మాణానికి భూమి పూజ….

ఎమ్మెల్యే చేతులమీదుగా సచివాలయ నిర్మాణానికి భూమి పూజ….

తనకల్లు మండల పరిధిలోని గుంజు వారి పల్లి నందు సచివాలయ నిర్మాణానికి శనివారం భూమి పూజ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే సిద్ధారెడ్డి పాల్గొన్నారు.ఎమ్మెల్యే చేతులమీదుగా భూమి పూజ నిర్వహించి తదనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇద్దరికీ ఎమ్మెల్యే చేతులమీదుగా చెక్కులను అందజేశారు.అనంతరం ఎమ్మెల్యే సిద్ధారెడ్డి మాట్లాడుతూ పార్టీ చేస్తున్న అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాల గురించి, పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కొనియాడారు.బాబే నాయక్ తాండ,సుబ్బరాయని పల్లి,యనమల వారి పల్లి లోని తారు రోడ్ల వేయుటకు ఎమ్మెల్యే సిద్ధారెడ్డి భూమి పూజ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు తహసిల్దార్ సుబ్బలక్ష్మమ్మ, రెవిన్యూ ఇన్స్పెక్టర్ మల్లికార్జున, ఈవో ఆర్ డి ఆనందయ్య, పంచాయతీ అధికారిని వాణి సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, వైఎస్ఆర్సిపి పార్టీ మండల కన్వీనర్ మధుసూదన్ రెడ్డి, కొక్కంటి శ్రీనివాసులు నాయుడు, రాం దేశాయ్, శ్రీకంఠ రెడ్డి, నీలకంఠ రెడ్డి, కొండ మల్లికార్జున, తబ్రేజ్ నాయకులు, కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.

Related posts