Select your Top Menu from wp menus

తనకల్లు వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు వేరుశనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ పి వి సిద్ధారెడ్డి..

తనకల్లు వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు వేరుశనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ పి వి సిద్ధారెడ్డి..

తనకల్లు వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు గురువారం నుండి వేరుశనగ కొనుగోలు కేంద్రాన్ని చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కదిరి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి హాజరయ్యారు.
ఎమ్మెల్యే కి వైసిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలికారు
మొదట వేరుశనగ కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పివి సిద్ధారెడ్డి రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు.
ఎమ్మెల్యే రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట పై ధరల స్థిరీకరణ కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కొనియాడారు.
వేరుశనగను రైతులు దళారుల కు అమ్మి వారి చేతిలో మోసపోకుండా వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు అమ్ముకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్ మధుసూదన్ రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, శ్రీకంఠ రెడ్డి, రామ్ దేశాయి ,తబ్రేజ్, కొక్కంటి శ్రీనివాసులు నాయుడు, భక్తవత్సల రెడ్డి, మండల స్థాయి అధికారులు రెవిన్యూ ఇన్స్పెక్టర్ మల్లికార్జున్, పంచాయతీ అధికారి వాణి తదితరులు పాల్గొన్నారు.

Related posts