Select your Top Menu from wp menus
Breaking News

హెరిటేజ్ ఆధ్వర్యంలో జాతీయ పాల దినోత్సవం

హెరిటేజ్ ఆధ్వర్యంలో జాతీయ పాల దినోత్సవం

బి.కొత్తకోట (చిత్తూరు జిల్లా)

క్షీర విప్లవ పితామహుడు కురియన్‌ జయంతి సందర్భంగా చిత్తూరు జిల్లా బి.కొత్తకోట లోని హెరిటేజ్ ఫుడ్స్ వారి ఆధ్వర్యంలో జాతీయ పాల దినోత్సవాన్నీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమా నికి ముఖ్యఅతిథిగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి మరియు ఆమె కుమారుడు దేవాన్ష్ విచ్చేశారు.ఈ సందర్భంగా బి.కొత్తకోట హెరిటేజ్ వారు ఏర్పాటుచేసిన స్టాల్స్ ను, మెగా పశు వైద్య శిబిరాన్ని, హెరిటేజ్ సిబ్బంది ఏర్పాటుచేసిన రక్త దాన శిబిరం ను నారా బ్రాహ్మణి పరిశీలించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి హెరిటేజ్ సంస్థను ఉద్దేశించి ఆమె మాట్లాడారు తిరుపతి పరిసరాలలో 14 హెరిటేజ్ పాలశీతలీకరణ కేంద్రాలు ఉన్నాయని వీటన్నింటిలో బి.కొత్తకోట కు సంబంధించిన శీతలీకరణ కేంద్రం నుండి అధికంగా పాలు వస్తున్నాయని హెరిటేజ్ సంస్థ ఏర్పాటు చేసినప్పుడు కేవలం రెండు గ్రామాల నుండి 250 లీటర్ల పాలను మాత్రం శీతలీకరణ చేయడం జరిగిందని ఇప్పుడు ఈరోజు దాదాపుగా కొన్ని వేల లీటర్ల పాలను శీతలీకరణ చేసి హెరిటేజ్ ఫుడ్స్ తయారుచేయడం చాలా ఆనందించ దగ్గ విషయమని ఆమె అన్నారు. అనంతరం ఈ కార్యక్రమమునకు విచ్చేసినటువంటి చుట్టుపక్కల గ్రామస్తులకు మరియు హెరిటేజ్ సిబ్బందిని హెరిటేజ్ సంస్థ యొక్క కస్టమర్ల కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రామచంద్ర నాయుడు, ప్రసన్న, శ్రీనివాస్,వినోద్ కుమార్, చంద్రశేఖర్ రావు,తులసినాయుడు, డా:బాలక్రిష్ణ, హెరిటేజ్ సిబ్బంది మరియ రైతులు పాల్గొన్నారు.

Related posts