జ్యూవెలరీ దుకాణాలపై తూనికలు,కొలతలు శాఖ అధికారులు ఆకస్మిక దాడులు
A1Tv తెలుగు న్యూస్(బి.కొత్తకోట)
చిత్తూరు జిల్లా బి.కొత్తకోట పట్టణంలో తూనికలు కొలతల శాఖ వారి ఆధ్వర్యంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. పట్టణంలో మూడు జ్యూవెలరీ దుకాణాలపై కేసు నమోదు చేశారు. పట్టణం లో 42 జ్యూవెలరీ దుకాణాలు ఉండగా తూనికలు,కొలతలు శాఖ అధికారులు వచ్చారని సమాచారం రావడం తో దాదాపు 25 దుకాణాలు మూసి వేయగా అధికారులు మండిపడ్డారు తప్పుచేయక పోతే దుకాణాలను ఎందుకు మూసివేస్తారని డిప్యూటీ కంట్రోలర్ దుకాణాల యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ కంట్రోలర్ ఏకాంబరం ఆచారి, కంట్రోలర్ సుధాకర్ ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. ఏదైనా దుకాణాలలో తప్పు జరుగుతుంటే మమ్మల్ని అడిగి తప్పును యజమానులు సరిచేసుకోవచ్చు తెలిపారు. అలాగే కొనుగోలు దారులు కూడా బంగారు కొనేటప్పుడు జాగ్రత్తగా హల్మార్కు,బిల్లులు సరిగా చూసుకోవాలని సూచించారు.