Select your Top Menu from wp menus

ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం… అనంతపురం జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు…..

ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం… అనంతపురం జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు…..

ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు గట్టిగా పని చేయండి

* కర్నాటక సరిహద్దు ప్రాంతాల్లోని ఇసుక చెక్ పోస్టులను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
* జిల్లా సరిహద్దుల్లో నిర్వహిస్తున్న 9 చెక్ పోస్టుల్లో సిబ్బంది పటిష్టంగా పనిచేసేలా ఆదేశాలు
జిల్లాలో ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు గట్టిగా పని చేయాలని జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు ఆదేశించారు. జిల్లాలోని కర్నాటక సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పోలీసు చెక్ పోస్టులను ఆయన బుధవారం తనిఖీ చేశారు. క్షేత్ర స్థాయిలోని పరిస్థితులను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. ఇందులో భాగంగా తనకల్లు మండలం కొక్కంటి క్రాస్ … ఆమడగూరు మండలం కుమ్మరిల్లు… ఓబుళదేవరచెర్వు మండలం మహమ్మదాబాద్ … గోరంట్ల మండలం కోరేవాండ్లపల్లి, గుమ్మయ్యగారిపల్లి వద్ద ఏర్పాటు చేసిన పోలీసు చెక్ పోస్టులను తనిఖీ చేశారు. ఆయా చెక్ పోస్టుల వద్ద జిల్లా మీదుగా కర్నాటకకు వెళ్లే లారీలు, ట్రిప్పర్లను క్షుణ్ణంగా తనిఖీ చేయించారు. ఈసందర్భంగా చెక్ పోస్టుల సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ చెక్ పోస్టులు నిరంతరం (24/7) పని చేయాలన్నారు. ప్రతీ లారీ, ట్రిప్పర్ ను క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జిల్లా నుండీ కర్నాటకకు ఇసుక రేణువు కూడా వెళ్లరాదన్నారు. వీలయితే ఏ.ఆర్ సిబ్బందిని కేటాయిస్తామన్నారు. ఇతర ప్రభుత్వ విభాగాలైన మైన్స్ , రెవెన్యూ, ఎ.పి.ఎం.డి.సి, తదితర శాఖల సిబ్బందితో కలసి సమన్వయంతో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలన్నారు. ఈరోజు తనిఖీ చేసిన చెక్ పోస్టులతో పాటు కంబదూరు పోలీసు స్టేషన్ పరిధిలో రెండు, బ్రహ్మసముద్రం, కొడికొండ ల వద్ద కూడా పోలీసు చెక్ పోస్టులు నిర్వహిస్తున్నారు. వీటితో కలిపి జిల్లాలో మొత్తం 9 చెక్ పోస్టులు పని చేస్తున్నాయి… జిల్లాలోని అన్ని చెక్ పోస్టుల సిబ్బంది గట్టిగా, సమర్థవంతంగా పని చేసేలా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. క్షేత్ర స్థాయి పర్యవేక్షణలో భాగంగా చెక్ పోస్టుల తనిఖీకు వెళ్లిన జిల్లా ఎస్పీతో పాటు కదిరి డీఎస్పీ షేక్ లాల్ మహమ్మద్ , కదిరి రూరల్ సి.ఐ మధు, నల్లమడ సి.ఐ నరసింహరావు, తదితర అధికారులు వెళ్లారు.

Related posts