Select your Top Menu from wp menus
Breaking News

బ్రోచేవారెవరురా’తో భారీ హిట్ .. హీరో శ్రీవిష్ణు

బ్రోచేవారెవరురా’తో భారీ హిట్ .. హీరో శ్రీవిష్ణు

మొదటి నుంచి కూడా శ్రీవిష్ణు విభిన్నమైన కథలను .. పాత్రలను ఎంచుకుంటూ వస్తున్నాడు. ఈ కారణంగానే యూత్ లో ఆయనకి మంచి క్రేజ్ ఏర్పడింది. ఒక్కో సినిమాకి తన ప్రత్యేకతను చాటుతూ వెళుతున్న శ్రీవిష్ణు, ‘బ్రోచేవారెవరురా’ సినిమాతో భారీ విజయాన్నే తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తరువాత సినిమాగా ఆయన చేసిన ‘తిప్పరా మీసం’ .. ఈ నెల 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. ‘బ్రోచేవారెవరురా’ విజయం తరువాత పారితోషకం పెంచారా?’ అనే అంతా అడుగుతున్నారు. ఆ సినిమాకి ముందే నేను నాలుగు సినిమాలు కమిట్ అయ్యాను. అందువలన పారితోషికం పెంచమని వాళ్లను అడగలేను. ఈ మూడు ప్రాజెక్టుల తరువాత చేసే సినిమాలకి పారితోషికం పెంచుతానేమో” అన్నాడు. ఇక తన తాజా చిత్రమైన ‘తిప్పరా మీసం’ తప్పకుండా హిట్ అవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.

Related posts