Select your Top Menu from wp menus
Breaking News

అర్జున్ రెడ్డి’ రీమేక్ గా ‘ఆదిత్యవర్మ’ విడుదల తేదీ ఖరారు ..!

అర్జున్ రెడ్డి’ రీమేక్ గా ‘ఆదిత్యవర్మ’ విడుదల తేదీ ఖరారు ..!

తెలుగులో ‘అర్జున్ రెడ్డి’ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇదే సినిమాను హిందీలో రీమేక్  చేయగా అక్కడ కూడా భారీ విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను తమిళంలో ‘ఆదిత్య వర్మ’ టైటిల్ తో రీమేక్ చేశారు. సీనియర్ హీరో విక్రమ్ తనయుడు ‘ధృవ్’ ఈ సినిమా ద్వారా వెండితెరకి హీరోగా పరిచయమవుతున్నాడు.  ఆయన జోడీగా ‘బనిత సంధు’ నటించింది.తాజాగా ఈ సినిమాకి విడుదల తేదీని ఖరారు చేశారు. ఈ నెల 21వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు. గిరీశాయ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై, తమిళనాట భారీ అంచనాలు వున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ లో ధృవ్ తో కలిసి విక్రమ్ కూడా పాల్గొంటున్నారు. తొలి ప్రయత్నంలోనే ధృవ్ హిట్ కొట్టాలనే ఉద్దేశంతో ఆయన వున్నాడు. ఆయన కోరిక నెరవేరుతుందేమో చూడాలి.

Related posts