Select your Top Menu from wp menus
Breaking News

తనకల్లు లో అఖిలభారత అవినీతి నిర్మూలన మరియు వినియోగదారుల సంఘం నూతన మండల కమిటీ ఎన్నిక……

తనకల్లు లో అఖిలభారత అవినీతి నిర్మూలన మరియు వినియోగదారుల సంఘం నూతన మండల కమిటీ ఎన్నిక……

అఖిల భారత అవినీతి నిర్మూలన నూతన మండల కమిటీ ఎన్నిక….

తనకల్లు మండల కేంద్రంలోని స్థానిక బీసీ హాస్టల్ నందు జరిగిన అఖిలభారత అవినీతి నిర్మూలన మరియు వినియోగదారుల సంఘం నూతన మండల కమిటీ ని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుధాకర్,ODC మండలం అధ్యక్షుడు పివి. రమణ రెడ్డి ఇ కదిరి డివిజన్ కోఆర్డినేటర్ మంజునాథ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సమావేశంలో నాయకులు మాట్లాడుతూ దేశంలో అవినీతి ఎక్కడ చూసినా అవినీతి నిర్మూలన కోసం ఎన్ని చట్టాలు ఉన్న అవినీతి పనులు చేసి తప్పించుకుంటున్నారు. అవినీతిని నిర్మూలన చేసినప్పుడే భారతదేశం అభివృద్ధి చెందుతుందని వారు మాట్లాడారు. ప్రతి సామాన్య పౌరునికి అందుబాటులో ఉండే సమాచార హక్కు చట్టం ద్వారా ప్రతి ఒక్కరిని ప్రశ్నించి అవినీతిపరులను బట్టబయలు చేయవచ్చని తెలిపారు. వినియోగదారులు చాలా రకాలుగా మోస పోతున్నారని ప్రజలందరూ తూనికలు, కొలతలు కల్తీ వస్తువులు పైన జాగ్రత్త వహించాలని తెలిపారు. అందువల్లనే సమాజంలో మార్పు తీసుకురావడం కోసం AICCA సంస్థ అవగాహన సదస్సు ద్వారా ప్రజలను చైతన్యం చేస్తున్నామని తెలిపారు. అనంతరం నూతన మండల కమిటీ ని ఎన్నుకోవడం జరిగింది. మండల అధ్యక్షుడు
ఎం.నరేష్, ఉపాధ్యక్షులు వై.రమేష్, కార్యదర్శి
పి.ఓబులేష్,
సహాయ కార్యదర్శి జి.సురేష్ గోపి, కోశాధికారిగా కే.గంగరాజు మండల మహిళా కమిటీ కన్వీనర్ మమత లు కొనసాగుతున్నట్లు తెలిపారు.

Related posts