Select your Top Menu from wp menus
Breaking News

ఏపిజె అబ్దుల్ కలాం సేవలు చిరస్మరణీయం

ఏపిజె అబ్దుల్ కలాం సేవలు చిరస్మరణీయం

మిస్సైల్ మ్యాన్ భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ గారి 88 వ జయంతిని పురస్కరించుకుని చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం కొత్తవుడియం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో పాఠశాలకు కొత్త రంగులు వేసి అందంగా తీర్చిదిద్ది అబ్దుల్ కలామ్ చిత్రపటానికి పూల మాల వేసి పిల్లలకు మిఠాయిలు పంచి ఘనంగా నివాళులు అర్పించారు .ఈ సందర్భంగా మండల విద్యాశాకాధికారి రెడ్డి శేఖర్ మాట్లాడుతూ విద్యార్థులు కలాం గారిని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో బి.కొత్తకోట హెల్పింగ్ మైండ్స్ ఇంచార్జ్ జాబీర్,సభ్యులు సంకు సబ్జీ,దశరథ,రాఘవేంద్ర,పవన్, నరసింహ, మరియు ఉపాధ్యాయులు మణి, గ్రామస్తులు పాల్గొన్నారు

Related posts